Vande Bharat | ఆహారంలో పురుగు.. ప్రయాణికుడి ఫిర్యాదుతో సర్వీస్ ప్రొవైడర్‌కు రూ.10 లక్షల జరిమానా
Vande Bharat | అహ్మదాబాద్ నుంచి ముంబైకి వందే భారత్ రైలులో ప్రయాణించిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. అతడికి అందించిన ఆహారంలో పురుగు కనిపించడంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
Vande Bharat | రైళ్లలో అందించే ఫుడ్ (Meals) క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మార్పు మాత్రం రావడం లేదు. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలే తరచూ పునరావృతం అవుతూ వస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్ నుంచి ముంబైకి వందే భారత్ రైలులో ప్రయాణించిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. అతడికి అందించిన ఆహారంలో పురుగు కనిపించడంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
వెంటనే ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. తన కోచ్‌లో ఇలాంటివి కనీసం రెండు ఘటనలు జరిగినట్లు చెప్పారు. తనతోపాటూ ఇతర ప్రయాణికులు కూడా ఆహారం తినడం ఆపేశారని పేర్కొన్నాడు. ఈ మేరకు ఆహారంలో పురుగు వచ్చిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. దాల్ చావల్ మీల్ బాక్సులో పురుగు వచ్చిందని తెలిపాడు. ఆర్కే గ్రూప్‌కు చెందిన మెసర్స్ బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్లు ఈ ఆహారాన్ని సరఫరా చేసినట్లు అతను పేర్కొన్నాడు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ ఐఆర్‌సీటీసీకి ట్యాగ్ చేశాడు.
Found an insect in Vande Bharat train food (Ahmedabad → Mumbai). Atleast 2 such cases in my coach, everyone stopped eating after that.
Vendor: M/S Brandavan Food Products (part of RK Group).@fssaiindia @AshwiniVaishnaw @RailMinIndia @IRCTCofficial
Just one request to the… pic.twitter.com/rNrfVaNN5b
— Aditya Didwania (@adityadidwania) April 6, 2026
ఈ ట్వీట్‌పై స్పందించిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. సదరు సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. రూ.10 లక్షల జరిమానా విధిస్తామని, కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేస్తున్నామని తెలిపింది. అంతేకాదు, ఆ కిచెన్‌ను సీల్ చేసి డీప్ క్లీనింగ్, పెస్ట్ కంట్రోల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనకు తాము తీవ్రంగా చింతిస్తున్నట్లు తెలిపింది. పరిశుభ్రత, ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత అని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.
కాగా, ఇటీవలే ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 15వ తేదీన 21896 నంబర్ గల పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ వ్యక్తి ప్రయాణించాడు. ఆ సమయంలో తనకు అందించిన ఆహార నాణ్యతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ మేరకు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ.. ఐఆర్‌సీటీసీకి రూ. 10 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు, సదరు సర్వీస్ ప్రొవైడర్‌పై రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ.. వారి కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత, నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యత అని రైల్వేశాఖ స్పష్టం చేసింది. నాణ్యత విషయంలో రాజీపడేది లేదని తెలిపింది. ఈ ఘటన మరవకముందే ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకోవడం రైళ్లలో అంతించే ఆహార నాణ్యతపై మరోసారి తీవ్రంగా చర్చ మొదలైంది.
Also Read..
రానున్న 12 గంటల పాటూ రైలు ప్రయాణాలు చేయకండి.. ప్రజలకు కీలక హెచ్చరికలు
ఒక శాతం తగ్గిన నాన్‌వెజ్ థాలీ.. స్థిరంగా శాఖాహార భోజనం ధర
సంబంధిత వార్తలు

IRCTC | ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్.. రూ.17,600కే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్
మే 21, 2026

Train Accidents | రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
మే 20, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



