TVK | తమిళనాట టీవీకే హవా.. విజయ్ వెనుక ప్రశాంత్ కిషోర్..?
TVK | తమిళనాట విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ సత్తాచాటుతోంది. తాజా ఎన్నికల ఫలితాల్లో సెంచురీ దాటి 105 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 2024లో విజయ్ టీవీకేని స్థాపించారు. కేవలం రెండేళ్లలోనే ఈ స్థాయిలో ప్రజాదరణ పొందడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక విజయ్ వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉండటం కూడా కలిసొచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
TVK | తమిళనాట విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ సత్తాచాటుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దొరక్కుండా అనూహ్యమైన ఫలితాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఫలితాల్లో విజయ్ పార్టీ సెంచురీ మార్క్‌ను దాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రస్తుతం 105 స్థానాల్లో దూసుకెళ్తోంది. అధికారంలోకి రావాలంటే 118 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. దీంతో ఈ ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది.
అయితే, ద్రావిడ పార్టీలకు కంచుకోట అయిన తమిళనాట తొలిసారి బరిలోకి దిగిన విజయ్ పార్టీ దూసుకెళ్లడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) పనిచేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పీకే స్వయంగా ప్రకటించారు.
ధోనీ చెన్నైని గెలిపించినట్లు నేను విజయ్‌ని గెలిపిస్తా
వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రికళగం (Tamilaga Vettri Kazhagam) అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తుందన్నారు. ఐపీఎల్‌లో క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపించినట్లుగా తాను రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రికళగంను గెలిపిస్తానని చాలెంజ్ చేశారు. దీంతో విజయ్ పార్టీ విజయానికి పీకే వ్యూహం ఫలించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడుకు ఆయన ఓ ఆశాకిరణం..
గతేడాది ఫిబ్రవరిలో చంగల్పట్టు జిల్లాలోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన టీవీకే రెండో వార్షిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీకే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడాలేని విధంగా రాజకీయ అవినీతి తమిళనాడులో ఉంది. అవినీతి, కుటుంబ పాలన రాష్ట్రంలో పోవాలి. అలా జరగాలంటే విజయ్ లాంటి వ్యక్తి రావాలి. విజయ్‌కు వ్యూహరచనల్లో సహాయం, ఎలాంటి సలహాలూ అవసరం లేదు. ఆయన ఆలోచనలు, సమాజంపై ఉన్న ప్రేమ, బాధ్యత నాకు తెలుసు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పును చూడాలనుకునే కోట్లాది మంది ప్రజలకు విజయ్ ఓ కొత్త ఆశాకిరణం. నేను ఏ పార్టీతో, నాయకుడితో కలిసి పనిచేయనని నాలుగేళ్ల క్రితమే ప్రకటించాను. కానీ విజయ్ నాకు రాజకీయ నాయకుడు కాదు. ఆయన నాకు ఓ బ్రదర్ లాంటివాడు’ అని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ ఒక కొత్త రాజకీయ చరిత్రను సృష్టించబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
విజయ్ (TVK)పార్టీని గెలిపిస్తే ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ తమిళనాడులో వస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. తమిళం నేర్చుకుని వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల తర్వాత విజయ్ పార్టీ విజయోత్సవంలో తమిళంలో మాట్లాడతానని ప్రకటించారు. విజయ్ తో మాట్లాడినప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి నిబద్ధతతో ఉన్నాడని తెలుసుకున్నానని పీకే చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకు వచ్చేలా ఆయన ఆలోచనలు ఉన్నాయన్నారు. తమిళనాడు విజయ్ ఓ కొత్త ఆశాకిరణం అని ఆయన అభివర్ణించారు.
Also Read..
సీఎం.. నీకు సిగ్గు, లజ్జ ఉంటే సక్కగ పాలించు.. పనికిమాలిన కేసులొద్దు: కేటీఆర్
డీఎంకేకు షాక్.. వెనుకంజలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



