Bandi Sanjay | బెంగాల్ ను గెలవాలే.. ఇదే మా ఆతృత: బండి సంజయ్
Bandi Sanjay | పశ్చిమ బెంగాల్ (West Bengal) ను గెలవాలని.. ఇదే మా ఆతృత అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బెంగాల్, పుదుచ్చేరిలో గెలుపు దిశగా పయనిస్తున్నామని, అసోం (Assam) లో వార్ వన్‌సైడ్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
- సీఎంలు రేవంత్, స్టాలిన్‌లకు ఈ ఫలితాలు చెంపపెట్టు
- దక్షిణ, ఉత్తర అని విభజన విష కోరలను నింపారు
- కాల్పుల ఘటనను రాజకీయ కోణంలో చూడొద్దు
- బాధితుల పరామర్శలో కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్ (West Bengal) ను గెలవాలని.. ఇదే మా ఆతృత అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బెంగాల్, పుదుచ్చేరిలో గెలుపు దిశగా పయనిస్తున్నామని, అసోం (Assam) లో వార్ వన్‌సైడ్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ (Karimnagar) కాల్పుల ఘనటలో గాయపడిన వారిని ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లే వస్తాయని పేర్కొన్నారు.
సర్‌తో చొరబాటుదారులకు చెక్..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఎన్నికల ఫలితాలు వారికి చెంపపెట్టులాంటివి. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయి. విభజన విష కోరలను నింపే సీఎం రేవంత్‌రెడ్డికి, తమిళనాడు సీఎం స్టాలిన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. బెంగాల్, పుదుచ్చేరిలో మేం గెలుస్తున్నం. అసోంలో వార్ వన్‌సైడ్ ఉంది. దేశంలో కాంగ్రెస్ ఎక్కడా రాదు. బెంగాల్ గెలవాలని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నరు. బంగ్లాదేశ్ వాడు ఇక్కడికి వచ్చి ఓటేస్తే మేం ఒప్పుకోవాల్నా? సర్ (SIR) వచ్చింది కాబట్టే చొరబాటుదారులకు చెక్ పడింది అని బండి వ్యాఖ్యానించారు.
దొంగలు మీ సుట్టాలా?
కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలో జరిగిన కాల్పల సంఘటనను రాజకీయ కోణంలో చూడొద్దు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు. ఇది దారుణమైంది. తీవ్రమైంది. పొట్టకూటి కోసం పని చేసే సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆదుకోవాలని వాళ్ల యాజమాన్యంతో మాట్లాడిన. విమర్శించుకోవడం తప్పు కాదు. ఎప్పుడు విమర్శించుకోవాలో అప్పుడే విమర్శించుకోవాలి. తిట్టాలంటే మీకంటే ఎక్కువ తిడతా. కానీ నాకు మానవత్వం ఉంది. జ్ఞాన సంస్కారం ఉంది. కాల్పులు జరిగింది కేంద్ర మంత్రి ఇంటిపక్కనే అంటున్నరు. మరి ఎమ్మెల్యే ఇల్లు కూడా ఇక్కడే ఉంది. వాళ్ల ఇంటి ముందు నుంచే దొంగలు వెళ్లారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి మమ్మల్ని బద్నాం చేయడం ఎందుకు. నేరస్థులను త్వరగా పట్టుకోవాలని పోలీసులతో మాట్లాడినా. భద్రతా వైఫల్యం ఉంది. ఘటన జరిగిన వెంటనే ధైర్యం చెప్పాలి. విమర్శలు కాదు. దొంగలు బీఆర్ఎస్ నాయకుల సుట్టాలా? అని ఆయన ఎద్దేవా చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhadrachalam Rama Controversy | భద్రాద్రి రాముడే కొట్టుకుపోతాడా?
- ●S. Janaki | జానకి తొలి సినిమా రిలీజ్ కాలేదు - తెలుగులో ఆమె పాడిన సూపర్ హిట్ సాంగ్స్ ఇవే
- ●Harish Rao Slams CM Revanth Reddy | రేవంత్‌కు, ఆ షాబాద్ హంతకుడికి తేడా లేదు
- ●Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం
- ●S Janaki | దిగ్గజ గాయని ఎస్ జానకి కన్నుమూత - అరవై ఏళ్ల సినీ ప్రయాణం - యాభై వేల పాటలు
- ●Naga Durga | నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ - 10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 15 లక్షలు వచ్చాయి!

Bhadrachalam Rama Controversy | భద్రాద్రి రాముడే కొట్టుకుపోతాడా?

S. Janaki | జానకి తొలి సినిమా రిలీజ్ కాలేదు - తెలుగులో ఆమె పాడిన సూపర్ హిట్ సాంగ్స్ ఇవే

Harish Rao Slams CM Revanth Reddy | రేవంత్‌కు, ఆ షాబాద్ హంతకుడికి తేడా లేదు

Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం




