Amarnath Yatra 2026 | అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. భారీ వర్షంలోనూ తరలివెళ్తున్న భక్తులు
Amarnath Yatra 2026 | అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభమైంది. జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు తరలివెళ్లారు. తొలి బ్యాచ్ శుక్రవారం ఉదయం బల్తాల్ (Baltal), పహల్గామ్ బేస్ క్యాంపుల (Pahalgam base camps) నుంచి బయల్దేరి వెళ్లారు. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు ఎంతో ఉత్సాహంగా హరహర మహదేవ్, జై భోలేనాథ్ అంటూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
Amarnath Yatra 2026 | హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్‌నాథ్ (Amarnath Yatra) ఒకటి. జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని 3,880మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు ఏటా భక్తులు తరలివెళ్తుంటారు. అంతటి పవిత్ర వార్షిక యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది (Amarnath Yatra 2026). తొలి బ్యాచ్ శుక్రవారం ఉదయం బల్తాల్ (Baltal), పహల్గామ్ బేస్ క్యాంపుల (Pahalgam base camps) నుంచి బయల్దేరి వెళ్లారు. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు ఎంతో ఉత్సాహంగా హరహర మహదేవ్, జై భోలేనాథ్ అంటూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
యాత్ర సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు బల్తాల్ నోడల్ ఆఫీసర్ రాహుల్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేదని తెలిపారు. ఈరోజు దాదాపు 10,000 మంది యాత్రకు బయల్దేరినట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్రికులకు వసతి కల్పించేందుకు వివిధ ప్రాంతాల్లో అత్యవసర ఆశ్రయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
మరోవైపు ఈ పవిత్ర యాత్ర సందర్భంగా ఆ మార్గంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులు, సీఆర్పీఎఫ్, ఇతర పారామిలటరీ బలగాలను మోహరించారు. డ్రోన్లతో ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. ఇవాళ ప్రారంభమైన ఈ పవిత్ర యాత్ర 57 రోజులపాటు కొనసాగనుంది. ఈ వార్షిక యాత్ర రక్షాబంధన్ పండుగ రోజున అంటే ఆగస్టు 28న ముగియనుంది. యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్ మార్గం నుంచి కాలినడకన, లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకుంటారు.
Also Read..
ఉద్యోగులకు ఐటీఆర్-1లో భారీ ఊరట.. సులభంగా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు..
అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..
ఇద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లారు.. అంతలోనే రూమ్‌లో యువతి మృతి
తాజావార్తలు
- ●SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?

SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!






