Hyderabad | ఇద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లారు.. అంతలోనే రూమ్‌లో యువతి మృతి
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) లంగర్‌హౌస్‌లోని ఓ లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. నగరంలోని అల్వాల్‌కు చెందిన రేణుక (26) అనే యువతికి గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారుక్ (34)తో కొంతకాలంగా పరిచయం ఉంది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) లంగర్‌హౌస్‌లోని ఓ లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. నగరంలోని అల్వాల్‌కు చెందిన రేణుక (26) అనే యువతికి గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారుక్ (34)తో కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ గురువారం రాత్రి లంగర్‌హౌస్‌లోని ఎండీ లైన్స్ వద్ద ఉన్న ఓ హోటల్ గ్రాండ్ లాడ్జ్‌లో గదిని (రూమ్ నంబర్ 1611) బుక్ చేసుకున్నారు. అనంతరం తాను కొద్దిసేపు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక గదిలో ఉరివేసుకుని కనిపించిందని ఫారుక్ పోలీసులకు తెలిపాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
అయితే రేణుక కుటుంబ సభ్యులు మాత్రం ఫారుక్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఫారుక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. ఫారుక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేణుకది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..
- ●KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
- ●Harish Rao | గుండె తరుక్కుపోతున్నది : హరీశ్‌రావు
- ●BRS Party | 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న

Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు




