త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Baby Dies | అంబులెన్స్ లేక భుజాల‌పై మోసుకెళ్లారు.. గ‌ర్భంలోనే బిడ్డ మృతి

Baby Dies | అంబులెన్స్ స‌దుపాయం లేదు.. గ‌ర్భిణిని భుజాల‌పై మోసుకెళ్లారు. క‌ష్ట‌ప‌డి చెమ‌టోడ్చి ఆస్ప‌త్రికి తీసుకెళ్లినా.. అక్క‌డ స‌మ‌యానికి గైనకాల‌జిస్టు కూడా లేరు. చివ‌ర‌కు బిడ్డ త‌ల్లి గ‌ర్భంలోనే మృతి చెందింది.

S

National | Published On May 31, 2026, 10.11 am IST

Baby Dies | అంబులెన్స్ లేక భుజాల‌పై మోసుకెళ్లారు.. గ‌ర్భంలోనే బిడ్డ మృతి
Advertisement

Baby Dies | త్రినేత్ర‌.న్యూస్ : అంబులెన్స్ స‌దుపాయం లేదు.. గ‌ర్భిణిని భుజాల‌పై మోసుకెళ్లారు. క‌ష్ట‌ప‌డి చెమ‌టోడ్చి ఆస్ప‌త్రికి తీసుకెళ్లినా.. అక్క‌డ స‌మ‌యానికి గైనకాల‌జిస్టు కూడా లేరు. చివ‌ర‌కు బిడ్డ త‌ల్లి గ‌ర్భంలోనే మృతి చెందింది. ఈ విషాద ఘ‌ట‌న జ‌మ్మూక‌శ్మీర్‌లోని కిష్టావ‌ర్ జిల్లాలో వెలుగు చూసింది.

కిష్టావ‌ర్ జిల్లాలోని డెహ‌ర్నా గ్రామానికి చెందిన షైస్తా బేగంకు నెల‌లు నిండాయి. పురిటి నొప్పులు రావ‌డంతో ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు. కానీ ఆ గ్రామానికి క‌నీసం రోడ్డు స‌దుపాయం లేక‌పోవ‌డంతో.. కుటుంబ స‌భ్యులు ఆమెను భుజాల‌పై మోసుకెళ్లారు.

భుజాల‌పై మోసుకెళ్లినప్ప‌టికీ..

రాళ్ల మ‌ధ్య, గుట్ట‌ల మ‌ధ్య రెండు కిలోమీట‌ర్ల‌కు పైగా భుజాల‌పై మోసుకెళ్లినప్ప‌టికీ.. న‌వ‌పాచి హెల్త్ సెంట‌ర్‌లో స‌మ‌యానికి గైన‌కాల‌జిస్టు లేరు. చేసేదేమీ లేక పొదుపు చేసుకున్న డ‌బ్బుతో అంబులెన్స్ మాట్లాడుకొని.. 120 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అనంత్ నాగ్ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రికి బ‌య‌ల్దేరారు.

మలుపుల మ‌ధ్య‌నే గ‌ర్భంలోనే బిడ్డ..

ఆ ర‌హ‌దారి అంతా కూడా కొండ ప్రాంతం. మొత్తం మ‌లుపులే. వాహ‌నాలు చాలా నెమ్మ‌దిగా క‌దులుతుంటాయి. మొత్తానికి కొండ మలుపుల మ‌ధ్య‌నే గ‌ర్భంలోనే బిడ్డ చ‌నిపోయింది. ఎట్ట‌కేల‌కు ఆస్ప‌త్రికి చేరుకున్న‌ప్ప‌టికీ.. బిడ్డ గ‌ర్భంలోనే ప్రాణం కోల్పోయిన‌ట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

ప్ర‌తి గ‌ర్భిణి కూడా మృత్యువుతో పోరాటం

ఈ సంద‌ర్భంగా గ‌ర్భిణి భ‌ర్త నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. మా ప్రాంతంలో ప్ర‌తి గ‌ర్భిణి కూడా మృత్యువుతో పోరాటం చేస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొన్నాడు. మాకు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉంది. కానీ డాక్ట‌ర్లు ఉండ‌ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. గ‌ర్భిణికి ప్ర‌స‌వ వేద‌న మొద‌లైతే.. ఈ గుట్ట‌లు మా బిడ్డ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకోకూడ‌ద‌ని ప్రార్థిస్తామ‌ని నాసిర్ ఆవేద‌నతో చెప్పాడు.

Advertisement
Advertisement