Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..
Amazon Prime Day 2026 | నేటి అర్ధరాత్రి నుంచి అమెజాన్ ఇండియా తన ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుండడంతో అందులో అందించనున్న పలు బెస్ట్ డీల్స్, డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల వివరాలను ప్రకటించింది. అమెజాన్ తన 10వ ప్రైమ్ డే సేల్‌లో ఎర్లీ డీల్స్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది.
Technology | Published On Jul 3, 2026, 10.19 am IST
Amazon Prime Day 2026 | నేటి అర్ధరాత్రి నుంచి అమెజాన్ ఇండియా తన ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుండడంతో అందులో అందించనున్న పలు బెస్ట్ డీల్స్, డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల వివరాలను ప్రకటించింది. అమెజాన్ తన 10వ ప్రైమ్ డే సేల్‌లో ఎర్లీ డీల్స్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే పలు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడంతోపాటు వాటిపై సైతం విభాగాల వారీగా భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను అందిస్తున్నట్లు తెలియజేసింది. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రైమ్ డే సేల్ 2026 శుక్రవారం అర్ధరాత్రి 12న ప్రారంభమై జూలై 6న రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. మొత్తం 72 గంటల పాటు సేల్‌ను నిర్వహించనున్నారు.
భారీ డిస్కౌంట్ ధరకు ప్రైమ్ మెంబర్‌షిప్..
ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. వార్షిక ప్రైమ్ మెంబర్‌షిప్ ధరను రూ.1,499 నుంచి రూ.999కు తగ్గించగా, కొత్త వినియోగదారులకు అదనంగా రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ఏడాదికి రూ.299, ప్రైమ్ లైట్ ఏడాదికి రూ.599కు అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో చెల్లింపులు లేదా ఈఎంఐ లావాదేవీలపై గరిష్టంగా 10 శాతం వరకు ఆదా చేసే అవకాశం ఉంది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జి రూ.84,999కు లభిస్తుండగా, రూ.66వేల వరకు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్‌తోపాటు 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ ఎన్6 రూ.19,999కు, శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జి రూ.22,999కు, వన్‌ప్లస్ 13 రూ.49,999కు, ఐక్యూ జెడ్11ఎక్స్ రూ.19,999కు లభ్యమవుతున్నాయి. ఈ మోడళ్లపై కూడా 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది.
ల్యాప్ టాప్‌లు, ట్యాబ్‌లు, టీవీలపై..
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఆసుస్ వివోబుక్ 16 (ఐ5 13వ జెన్) రూ.62,740కు లభిస్తుండగా, రూ.12వేల వరకు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్, 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అందిస్తున్నారు. హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ (రైజెన్ 7, ఆర్‌టీఎక్స్ 4050) రూ.78,990కు బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. షియోమీ ప్యాడ్ 8 (8జీబీ, 128జీబీ) రూ.29,999కు, సోనీ హెచ్‌టీఏ3000 సౌండ్‌బార్ రూ.52,740కు 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో అందుబాటులో ఉంది. జేబీఎల్ లైవ్ 780ఎన్‌సీ హెడ్‌ఫోన్లు రూ.14,749కు బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. స్మార్ట్ టీవీలపై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. సోనీ బ్రావియా 3 సిరీస్ టీవీ రూ.62,990కు, శాంసంగ్ విజన్ ఏఐ స్మార్ట్ మినీ ఎల్‌ఈడీ టీవీ రూ.38,990కు, టీసీఎల్ క్యూడీ-మినీ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ రూ.40,990కు, షియోమీ స్మార్ట్ గూగుల్ ఎల్‌ఈడీ టీవీ రూ.19,999కు, ఎల్‌జీ ఎన్‌యూ87 ఏఐ నానో స్మార్ట్ టీవీ రూ.37,990కు, శాంసంగ్ 55 ఇంచుల క్రిస్టల్ 4కె విజన్ ఏఐ స్మార్ట్ టీవీ రూ.35,990కు లభిస్తున్నాయి. వీటిలో చాలా మోడళ్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
ఏఐ ద్వారా షాపింగ్ చేయొచ్చు..
పెద్ద గృహోపకరణాలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి ఉత్పత్తులపై కూడా భారీ తగ్గింపు ధరలతోపాటు బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ స్కీములను అందిస్తున్నారు. ఈ ప్రైమ్ డే సందర్భంగా ఏఐ ఆధారిత షాపింగ్ ఫీచర్లను కూడా అమెజాన్ ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తులను వెతకడానికి, పోల్చడానికి రూఫస్ ఏఐ అసిస్టెంట్, ఫొటో ద్వారా సెర్చ్ చేసే లెన్స్ ఏఐ, సమీక్షలను త్వరగా అర్థం చేసుకునే ఏఐ రివ్యూ హైలైట్స్, ఉత్పత్తులను వేగంగా పోల్చే క్విక్ వ్యూ, వ్యక్తిగత షాపింగ్ సారాంశాన్ని అందించే ప్రైమ్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ సభ్యులకు ఎర్లీ యాక్సెస్ ను ఇప్పటికే ప్రారంభించారు. ఇక ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, డిస్కౌంట్లు, ఆఫర్లను తెలుసుకునేందుకు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో సేల్ పేజ్ ను సందర్శించవచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | ఐటీ షేర్ల జోరుతో మార్కెట్లకు శుభారంభం.. భారీ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్..
- ●Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
- ●Akkineni Akhil | కంగ్రాట్స్ సామ్.. సమంతకు అక్కినేని అఖిల్ విషెస్
- ●Ronaldo | చరిత్రపుటల్లో రొనాల్డో
- ●Spain Vs Austria | ఒయార్జబల్ డబుల్.. ప్రీక్వార్టర్స్‌లోకి స్పెయిన్
- ●Accident | 9 గంటలకు పెండ్లి.. కొబ్బరి పొట్టు లారీ రూపంలో మృత్యువు..

Stock Markets | ఐటీ షేర్ల జోరుతో మార్కెట్లకు శుభారంభం.. భారీ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్..

Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..

Akkineni Akhil | కంగ్రాట్స్ సామ్.. సమంతకు అక్కినేని అఖిల్ విషెస్

Ronaldo | చరిత్రపుటల్లో రొనాల్డో






