Cristiano Ronaldo | రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్..? పోర్చుగల్ స్టార్ భవిష్యత్‌పై సోదరి కాటియా ఏమన్నదంటే..?
Cristiano Ronaldo | ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇంటర్నేషనల్ కెరీర్‌పై మరోసారి చర్చ మొదలైంది. 2026 ఫిఫా ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పోర్చుగల్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని రొనాల్డో సోదరి కాటియా అవీరో చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం 41 ఏళ్ల రొనాల్డో క్రొయేషియాతో జరిగే ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు.
Cristiano Ronaldo | ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇంటర్నేషనల్ కెరీర్‌పై మరోసారి చర్చ మొదలైంది. 2026 ఫిఫా ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పోర్చుగల్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని రొనాల్డో సోదరి కాటియా అవీరో చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం 41 ఏళ్ల రొనాల్డో క్రొయేషియాతో జరిగే ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఉజ్బెకిస్థాన్‌పై రెండు గోల్స్ చేసిన రొనాల్డో.. తుది మూడో భాగంలో అతడి కదలికలపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వయసు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రపంచకప్ చివరి ప్రధాన అంతర్జాతీయ టోర్నీ అవుతుందనే అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతోంది. స్పోర్ట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాటియా అవీరో ఈ అంశంపై స్పందించింది. ‘ఈ ప్రయాణాన్ని ఉన్నంతవరకు ఆస్వాదించండి. ఎందుకంటే ఇది త్వరలో ముగియబోతోంది. నమ్మదగిన వర్గాల నుంచి నాకు అందిన సమాచారం ప్రకారం ఇదే అతని చివరి డ్యాన్స్’ ఆమె వ్యాఖ్యానించింది.
రొనాల్డోపై విమర్శలు చేస్తున్న వారికి కూడా కాటియా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘ఫుట్‌బాల్‌ను ప్రేమించే వాళ్లు, ఆటను అర్థం చేసుకునే వాళ్లు రొనాల్డో గొప్పతనాన్ని గుర్తిస్తారు. గుర్తించని వారికే అది నష్టం. రెండు దశాబ్దాలకుపైగా అతడు ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఏలాడు. మా కుటుంబం ఎక్కడి నుంచి ఎక్కడికి చేరిందో మాకు తెలుసు. మా తల్లి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల తర్వాత వచ్చిన విమర్శలు మా ఆనందాన్ని ఏమాత్రం తగ్గించలేవు’ అని చెప్పింది. ‘ఈ 20 ఏళ్లకుపైగా సాగిన ప్రయాణాన్ని ఆస్వాదించడమే మాకు ముఖ్యమైన విషయం. అతడిపై నాకు ఎంతో గర్వంగా ఉంది. ఖతార్ ప్రపంచకప్‌లో నేను ఉన్నాను. ఇప్పుడు కూడా అతడితోనే ఉన్నాను. మాలో రొనాల్డోనే మరింత ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ప్రీక్వార్టర్‌లో స్పెయిన్‌తో తలపడాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉంటాం’ అని కాటియా పేర్కొంది.
మరోవైపు రొనాల్డో భవిష్యత్‌పై పోర్చుగల్ ఫుట్‌బాల్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్టు ప్రధాన కోచ్ రొబెర్టో మార్టినెజ్ ఇటీవల రొనాల్డో 2030 ప్రపంచకప్‌లోనూ ఆడే అవకాశం ఉందని వ్యాఖ్యానించగా పోర్చుగీస్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు పెడ్రో ప్రొయెంసా మాత్రం అది చాలా అసాధ్యమని, 2030 ప్రపంచకప్‌లో రొనాల్డో కనిపిస్తే పెద్ద ఆశ్చర్యమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందిన కాటియా అవీరో తన సోదరుడికి ఎప్పుడూ అండగా నిలుస్తూ వస్తోంది. 2022 ప్రపంచకప్‌లో అప్పటి కోచ్ ఫెర్నాండో శాంటోస్ నాకౌట్ మ్యాచ్‌ల్లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేయడాన్ని ఆమె బహిరంగంగా విమర్శించింది. అలాగే, ప్రస్తుత ప్రపంచకప్‌లో డీఆర్ కాంగోతో మ్యాచ్ అనంతరం బ్రూనో ఫెర్నాండెజ్ ప్రదర్శనపైన ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!
- ●Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు
- ●MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల
- ●Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
- ●Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంటల వ్యవధిలో నలుగురి మృతి
- ●రేవంత్ ‘యూఎస్ టూర్’ బ్రేక్: వివాదాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చిన తెలంగాణ సీఎం!

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు

MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్






