Switzerland Vs Algeria | స్విట్జర్లాండ్ సునాయాస విజయం
Switzerland Vs Algeria | ఫిఫా ప్రపంచకప్ 2026లో అల్జీరియాపై స్విట్జర్లాండ్ సునాయాస విజయం సాధించింది. గురువారం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో అల్జీరియాను 2-0తో ఓడించి ప్రీక్వార్టర్‌కు చేరుకుంది. బ్రెల్ ఎంబోలో, డాన్ డోయ్ అద్భుత ప్రదర్శనతో స్విస్ జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది.
- అల్జీరియాపై 2-0 తేడాతో గెలుపు
- రౌండ్ ఆఫ్ 16లోకి ఎంట్రీ
- ఎంబోలో, డాన్‌డోయ్ దూకుడు
Switzerland Vs Algeria | ఫిఫా ప్రపంచకప్ 2026లో అల్జీరియాపై స్విట్జర్లాండ్ సునాయాస విజయం సాధించింది. గురువారం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో అల్జీరియాను 2-0తో ఓడించి ప్రీక్వార్టర్‌కు చేరుకుంది. బ్రెల్ ఎంబోలో, డాన్ డోయ్ అద్భుత ప్రదర్శనతో స్విస్ జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. జూలై 4న కొలంబియా–ఘానా మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో స్విట్జర్లాండ్ వాంకూవర్ వేదికగా తలపడనుంది. మ్యాచ్ ప్రారంభంలో అల్జీరియా ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి పది నిమిషాల పాటు బంతిపై నియంత్రణ కొనసాగించినా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని స్విట్జర్లాండ్ గోల్‌గా మలిచింది.
అంతర్జాతీయ కెరీర్‌లో..
20 ఏళ్ల యువ ఆటగాడు జోహాన్ మంజాంబి వేగంగా దూసుకెళ్లి ఇచ్చిన అద్భుత క్రాస్‌ను బ్రెల్ ఎంబోలో గోల్‌గా మలిచాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఎంబోలోకు ఇది 26వ గోల్. అనంతరం అతను తన ట్రేడ్‌మార్క్ ‘నీ స్లైడ్’ సెలబ్రేషన్‌తో అభిమానులను అలరించాడు. ద్వితీయార్థం ప్రారంభమైన వెంటనే స్విస్ జట్టు ఆధిక్యాన్ని పెంచుకుంది. పెనాల్టీ బాక్స్ వెలుపల నుంచి డాన్ డోయ్ కొట్టిన పవర్‌ఫుల్ షాట్‌ను అల్జీరియా గోల్‌కీపర్ లూకా జిదాన్ అడ్డుకోలేకపోయాడు. దీంతో స్విట్జర్లాండ్ 2-0తో పటిష్ట ఆధిక్యంలోకి వెళ్లింది. 81వ నిమిషంలో ఫాబియన్ రీడర్‌కు మూడో గోల్ చేసే అవకాశం వచ్చినా.. లక్ష్యాన్ని చేధించలేకపోయాడు. ఈ ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ విజయాల్లో యువ ఆటగాడు మంజాంబి కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తుది జట్టులో స్థానం దక్కించుకొని..
ప్రత్యామ్నాయ ఆటగాడిగా టోర్నీని ప్రారంభించిన అతను ప్రస్తుతం తుది జట్టులో స్థానం దక్కించుకొని రెండు గోల్స్, రెండు అసిస్ట్‌లతో ఆకట్టుకున్నాడు. కెనడాపై 2-1 విజయంతో టోర్నీని ప్రారంభించిన స్విస్ జట్టు.. ప్రస్తుతం అల్జీరియాను కూడా ఓడించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే వరుసగా నాలుగో ప్రపంచకప్‌లో ప్రీక్వార్టర్‌కు చేరిన స్విట్జర్లాండ్, 1938 తర్వాత ఒక్కసారి ఈ దశను దాటలేకపోయింది. 1954లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో మాత్రమే క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ఈసారి కొలంబియా, ఘానాపై గెలిస్తే ఆధునిక ప్రపంచకప్ హిస్టరీలో తొలిసారి క్వార్టర్‌ఫైనల్ చేరిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. మరోవైపు 2014 తర్వాత అల్జీరియా నాకౌట్ దశను దాటలేక టోర్నీకి వీడ్కోలు పలికింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్






