త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ వర్షాలు

Heavy Rain Alert | బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్ష సూచన ఉంద‌ని వెల్ల‌డించింది.

G

Telangana | Published On Jul 3, 2026, 12.57 pm IST

Heavy Rain Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ వర్షాలు
Advertisement

Heavy Rain Alert | త్రినేత్ర‌.న్యూస్‌: బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్ష సూచన ఉంద‌ని వెల్ల‌డించింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది.

శుక్ర‌వారం ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని చెప్పింది. జ‌గిత్యాల‌, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, మేడ్చ‌ల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, గ‌ద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం కురుస్తుంద‌ని తెలిపింది.

శ‌నివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన గాలులు వీస్తాయ‌ని తెలిపింది. ఇక ఆదివారం రాష్ట్రంలో తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. అన్ని జిల్లాల్లో బ‌ల‌మైన ఉప‌రిత‌ల గాలులు వీస్తాయ‌ని పేర్కొంది.

Advertisement
Advertisement