ITR-1 | ఉద్యోగులకు ఐటీఆర్-1లో భారీ ఊరట.. సులభంగా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు..
ITR-1 | ఐటీఆర్-1 ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. అసెస్‌మెంట్ ఇయర్2026-27కు గాను జీతభత్యాలు పొందే పన్ను చెల్లింపుదారులకు పలు నియమాలను సడలించారు.
ITR-1 | ఐటీఆర్-1 ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. అసెస్‌మెంట్ ఇయర్2026-27కు గాను జీతభత్యాలు పొందే పన్ను చెల్లింపుదారులకు పలు నియమాలను సడలించారు. ఇప్పటివరకు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌లలో స్వల్ప లాభం వచ్చినా తప్పనిసరిగా సుదీర్ఘమైన ఐటీఆర్-2 ఫామ్‌ను దాఖలు చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలను సడలిస్తూ ఐటీఆర్-1 (సహజ్) పరిధిని విస్తరించింది. దీంతో చిన్న పెట్టుబడిదారులు, ఉద్యోగులు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభమైన ఐటీఆర్-1 ఫామ్ ద్వారా తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసుకునే అవకాశం లభించింది. అయితే ఈ సడలింపు అందరికీ వర్తించదు. కొన్ని నిర్దిష్ట షరతులు ఉండటంతో పలువురు ఇప్పటికీ ఐటీఆర్-2నే ఉపయోగించాల్సి ఉంటుంది.
రూ.1.25 లక్షల వరకు పరిమితి..
ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ఒక్క రూపాయి క్యాపిటల్ గెయిన్ వచ్చినా ఐటీఆర్-1కు అర్హత ఉండేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఆ నిబంధనను మార్చింది. సెక్షన్ 112ఎ కింద లిస్టెడ్ షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విక్రయం ద్వారా రూ.1.25 లక్షల వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) వచ్చినా ఐటీఆర్-1 ఫామ్‌ను దాఖలు చేసుకోవచ్చు. ఇప్పటికే రూ.1.25 లక్షల వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ఉండటంతో ఈ మార్పు చిన్న పెట్టుబడిదారులకు గణనీయమైన ఉపశమనాన్ని అందించినట్లయింది. ఈ ఏడాది ఐటీఆర్-1 పరిధిలో మరో కీలక మార్పును కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ఒకే ఇంటి ఆస్తి ఉన్నవారికే ఈ ఫామ్ వర్తించేది. ఇప్పుడు రెండు ఇళ్లు ఉన్నవారు కూడా ఐటీఆర్-1 (సహజ్) ద్వారా రిటర్న్ దాఖలు చేసుకోవచ్చు. ఉదాహరణకు స్వగ్రామంలో ఒక ఇల్లు, ఉద్యోగం చేస్తున్న నగరంలో మరో ఇల్లు ఉన్నప్పటికీ ఐటీఆర్-1ను ఎంచుకునే అవకాశం కల్పించారు.
వీరు ఐటీఆర్-2నే వాడాలి..
అయితే ఈ సడలింపులు ఉన్నప్పటికీ అందరూ ఐటీఆర్-1 దాఖలు చేయలేరని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఒక సంవత్సరంలోపు షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ విక్రయించి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టీసీజీ) పొందిన వారు తప్పనిసరిగా ఐటీఆర్-2నే దాఖలు చేయాలి. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ.1.25 లక్షలను మించి ఉంటే కూడా ఐటీఆర్-1కు అర్హత ఉండదు. స్టాక్ మార్కెట్‌లలో నష్టపోయి ఆ నష్టాన్ని భవిష్యత్ సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకునేవారు కూడా ఐటీఆర్-2ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇల్లు, భూమి లేదా బంగారం విక్రయం ద్వారా క్యాపిటల్ గెయిన్స్ పొందిన వారు కూడా ఐటీఆర్-1 దాఖలు చేయలేరు. అదేవిధంగా మొత్తం వార్షిక ఆదాయం రూ.50 లక్షలకు మించి ఉంటే ఐటీఆర్-2 తప్పనిసరి అవుతుంది. కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నవారు, అన్‌లిస్టెడ్ షేర్లు కలిగి ఉన్నవారు లేదా విదేశీ ఆదాయం లేదా విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు కూడా ఐటీఆర్-1కు అర్హులు కారు. అలాంటి వారు గతంలాగే ఐటీఆర్-2 ఫామ్ ద్వారానే ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు

ITR Refund | ఐటీఆర్‌ను ఫైల్ చేశాక రిఫండ్ ఎప్పుడు వస్తుంది.. రాకపోతే ఏం చేయాలి..?
ఆగస్టు 5, 2026

Income Tax Return | ఐటీఆర్ గడువు ముగిసింది.. అయినా ఫైల్ చేయలేదా.. ఇప్పుడెలా..?
ఆగస్టు 1, 2026

Income Tax Return | ట్యాక్స్ రిటర్న్‌కు చివరి గడువు నేడే.. ఇప్పటికే 5.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు
జులై 31, 2026
తాజావార్తలు
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..
- ●KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
- ●Harish Rao | గుండె తరుక్కుపోతున్నది : హరీశ్‌రావు
- ●BRS Party | 22A బాధితులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న

Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు



