Air India | సౌదీ అరేబియాకు విమానాల రద్దు.. అక్టోబర్ 20 వరకు ఎయిర్ ఇండియా సేవలు నిలిపివేత
Air India | సౌదీ అరేబియాలో నెలకొన్న భద్రతాపరమైన పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రియాద్, దమ్మామ్, జెడ్డా నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను అక్టోబర్ 20 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ విమాన సర్వీసులను అక్టోబర్ 17 వరకు రద్దు చేసిన సంస్థ.. తాజాగా ఆ గడువును పొడిగించింది.
Air India | సౌదీ అరేబియాలో నెలకొన్న భద్రతాపరమైన పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రియాద్, దమ్మామ్, జెడ్డా నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను అక్టోబర్ 20 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ విమాన సర్వీసులను అక్టోబర్ 17 వరకు రద్దు చేసిన సంస్థ.. తాజాగా ఆ గడువును పొడిగించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. సౌదీ అరేబియాలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, విమాన సర్వీసులను సురక్షితంగా తిరిగి ప్రారంభించేందుకు పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నామని వెల్లడించింది.
అక్టోబర్ 24 వరకు ఇతర సంస్థలు..
విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి నగదు వాపసు అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భద్రతా పరిస్థితుల కారణంగా ఇండిగో, ఆకాసా ఎయిర్ సంస్థలు కూడా సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించాయి. ఇండిగో తన విమానాల రద్దును అక్టోబర్ 24 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఆకాసా ఎయిర్ సైతం రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను అక్టోబర్ 24 వరకు, జెడ్డాకు సంబంధించిన సర్వీసులను అక్టోబర్ 21 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడడంతో ఇటీవలి రోజుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రియాద్ విమానాశ్రయంపైనా పలుమార్లు దాడులు జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavam | భక్తులను కటాక్షించిన శ్రీకృష్ణుడు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి..
- ●Malkajgiri Police | దసరాకు ఊరెళ్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- ●Janhvi Kapoor | రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో విలన్‌గా జాన్వీకపూర్ - సైలెంట్‌గా సెట్స్‌పైకి బాలీవుడ్ మూవీ
- ●Google | భూకంప హెచ్చరికలు.. 200కు పైగా దేశాలకు సేవలను విస్తరించిన గూగుల్..
- ●Gadwal | ఎస్సై వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య
- ●Arvind Kejriwal | డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్

Navaratri Brahmotsavam | భక్తులను కటాక్షించిన శ్రీకృష్ణుడు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి..

Malkajgiri Police | దసరాకు ఊరెళ్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Janhvi Kapoor | రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో విలన్‌గా జాన్వీకపూర్ - సైలెంట్‌గా సెట్స్‌పైకి బాలీవుడ్ మూవీ

Google | భూకంప హెచ్చరికలు.. 200కు పైగా దేశాలకు సేవలను విస్తరించిన గూగుల్..






