త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఈసీ నిర్ణయాలపై వివాదం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్

Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు (Supreme Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిష‌న్‌ను దాఖలు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించిన ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను మిగ‌తా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా తీసుకున్నార‌ని పిటిష‌న్‌లో ఆరోపించారు.

D

National | Published On Sep 25, 2026, 2.39 pm IST

Supreme Court | ఈసీ నిర్ణయాలపై వివాదం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ది ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ ప్ర‌చురించిన పరిశోధనాత్మక కథనం రాజ‌కీయ దుమారం రేపుతోంది. మిగ‌తా ఇద్ద‌రి క‌మిష‌న‌ర్ల ఆమోదం లేకుండానే చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. ఈ క‌థ‌నంపై ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ అంశంపై తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిష‌న్‌ను దాఖలు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించిన ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను మిగ‌తా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా తీసుకున్నార‌ని పిటిష‌న్‌లో ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌న్నింటినీ చ‌ట్ట‌విరుద్ధ‌మైన‌విగా ప్ర‌క‌టించాల‌ని అందులో కోరారు. అంతేకాదు, స‌ర్ ప్రక్రియ‌లో భాగంగా 13 కోట్ల మంది ఓట‌ర్ల పేర్లు జాబితా నుంచి తొల‌గించ‌డంపై సిట్‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అదేవిధంగా విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ జ్ఞానేశ్ కుమార్‌, సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ మ‌నీష్ గార్గ్‌, డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సీమా ఖ‌న్నాల‌పై క్రిమిన‌ల్ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని అభ్య‌ర్థించారు.

Also Read..

రాష్ట్ర హోదాను పున‌రుద్ద‌రించండి.. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో తీర్మానం

సిక్కింలో వ‌ర‌ద‌లు.. గ్రామంపై విరిగిప‌డ్డ కొండ‌చ‌రిలు

ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ త‌ప్ప‌నిస‌రి.. కొత్త చ‌ట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం

Advertisement
Advertisement