Landslides Hit Sikkim | సిక్కింలో వరదలు.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరిలు
Landslides Hit Sikkim | సిక్కిం (Sikkim)ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గ్యాల్‌షింగ్ జిల్లాలో రింబి గ్రామంలో (Rimbi Village) సింగ్లిటమ్ కొండ (Singlitam hillock) నుంచి వరద ప్రవాహం కిందకు కొట్టుకొచ్చింది. వరదతోపాటూ బురద, ఇసుక, బండరాళ్లు దూసుకొచ్చాయి. గ్రామంలోని 30కిపైగా ఇళ్లు, ప్రభుత్వ క్వార్టర్లు దెబ్బతిన్నాయి.
Landslides Hit Sikkim | త్రినేత్ర న్యూస్ : సిక్కిం (Sikkim)ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు (flash floods) సంభవించాయి. పలుచోట్ల భారీగా కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. తాజాగా గ్యాల్‌షింగ్ జిల్లాలో రింబి గ్రామంలో (Rimbi Village) సింగ్లిటమ్ కొండ (Singlitam hillock) నుంచి వరద ప్రవాహం కిందకు కొట్టుకొచ్చింది. వరదతోపాటూ బురద, ఇసుక, బండరాళ్లు దూసుకొచ్చాయి. గ్రామంలోని 30కిపైగా ఇళ్లు, ప్రభుత్వ క్వార్టర్లు దెబ్బతిన్నాయి.
ఈ వరదలకు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కొండచరియలు విరిగిపడిన కారణంగా రింబి-యుక్సమ్, రింబి-ఖేచేయోపాల్‌రి రోడ్లు మూతపడ్డాయి. గత 24 గంటల్లోనే రింబి ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 224.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మరోవైపు రింబిలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంపై ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రభావిత ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజల భద్రత, క్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
#WATCH | Sikkim | A major landslide in the Rimbi area has left more than 30 houses affected. The incident was triggered by heavy mudslides and debris coming down from the upper slopes, sending large quantities of mud, rocks and other debris towards the lower areas
(Video source:… pic.twitter.com/5rhBlSoiTB
— ANI (@ANI) September 25, 2026
Also Read..
ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం
కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
తాజావార్తలు
- ●Bonthu Rammohan | ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బొంతు రామ్మోహన్ నియామకం
- ●Rats Bit Female Students | గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
- ●NSE Share Price | నిరాశ పరిచిన ఎన్ఎస్ఈ షేర్లు.. స్వల్పంగా పతనం.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు..
- ●ED Notices to Arikepudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిక్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఈడీ
- ●Muslim Marriages | ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం
- ●Transgender | పెండ్లి చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని.. ట్రాన్స్జెండర్ ఆత్మహత్య!

Bonthu Rammohan | ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బొంతు రామ్మోహన్ నియామకం

Rats Bit Female Students | గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

NSE Share Price | నిరాశ పరిచిన ఎన్ఎస్ఈ షేర్లు.. స్వల్పంగా పతనం.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు..

ED Notices to Arikepudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిక్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఈడీ






