Actor Vijay | విజయ్ ఎంట్రీతో కొత్త మలుపుతిరిగిన తమిళ రాజకీయాలు.. పెద్ద పార్టీల పరిస్థితి ఏంటి..?
Actor Vijay | తమిళననాడు ప్రజలు మార్పు కోరుకున్నారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలను కాదని.. విజయ్ టీవీకే పార్టీకి మద్దతిచ్చారు. దశాబ్దాల కాలంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సాగుతున్న ద్విముఖ పోరులో విజయ్ ప్రవేశంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తాజా ఫలితాలతో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
- డీఎంకే, ఏఐడీఎంకే పాలనకు చెక్
- మరోసారి ప్రాంతీయ పార్టీవైపే మొగ్గుచూపిన తమిళ ప్రజలు
- జాతీయ పార్టీలకు నో ఛాన్స్
Actor Vijay | తమిళ రాజకీయాలు ద్రావిడ పార్టీల (Dravidian Giants) చుట్టూనే తిరుగుతుంటాయి. 1967 నుంచి రాష్ట్రంలో ద్రావిడ మున్నేట్ర కజగం (DMK), అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (AIADMK) మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉండేది. దశాబ్దాలపాటూ ఈ రెండు పార్టీలే రాష్ట్రాన్ని పాలించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు ద్రావిడ పార్టీలతో పొత్తుతో ఎన్నికల బరిలో దిగడం తప్ప.. ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటే పరిస్థితి అక్కడ లేదు.
జాతీయ పార్టీలను నమ్మని తమిళ ప్రజలు..
ఆ రెండు పార్టీలను కాదని జాతీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లలేవు. అక్కడి ప్రజలు కూడా జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వరు. ప్రాంతీయ పార్టీలకే మద్దతు ఇస్తుంటారు. ద్రావిడ అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న పార్టీలుగా.. తమిళనాడు ఓటర్లకు దశాబ్దాలుగా కేవలం DMK, AIADMK మాత్రమే దిక్కుగా ఉండేవి. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. విజయ్ ఎంట్రీతో తమిళ పాలిటిక్స్ కొత్త మలుపు తిరిగాయి.
ఇక ప్రచార సమయంలో విజయ్ ఓటర్లను బాగా ఆకర్షించగలిగారు. తనను తాను కేవలం ఒక కొత్త రాజకీయ నాయకుడిగా కాకుండా.. పెరియార్ సామాజిక న్యాయ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తిగా ప్రజల్లోకి వెళ్లారు. అంతేకాదు, తన ప్రత్యర్థి పార్టీల వ్యవస్థాపకులైన సి.ఎన్. అన్నాదురై (DMK), ఎంజీఆర్ (AIADMK) ఆశీస్సులు పొందిన వ్యక్తిగా ప్రజలకు చేరువయ్యారు.
అధికార పీఠం దిశగా టీవీకే..
2026 ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ప్రభంజనం సృష్టించి.. సాంప్రదాయ ద్రావిడ పార్టీలైన DMK, AIADMKలకు షాక్ ఇస్తూ అధికార పీఠం దిశగా దూసుకెళ్తోంది. ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఈ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. పార్టీ ప్రారంభించిన రెండేళ్లలోనే ఊహించని ఫలితాలను రాబడుతోంది. తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగిన ఆ పార్టీ.. పెద్దపెద్ద పార్టీలను కూడా వెనుకంజలో పడేసింది. ఏకంగా 110 స్థానాలకుపైగానే ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
పెద్ద పార్టీల పరిస్థితి ఏంటి..?
దశాబ్దాల కాలంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సాగుతున్న ద్విముఖ పోరులో విజయ్ ప్రవేశంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ద్రావిడ పార్టీల పాలనతో విసిగిపోయిన ప్రజలు.. జాతీయ పార్టీలను నమ్మలేదు. ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఇన్నిరోజులూ ఎదురుచూశారు. అదేసమయంలో ప్రాంతీయ పార్టీ అయిన విజయ్‌వైపే మొగ్గుచూపారు. తాజా పరిణామాలతో తమిళ రాజకీయాలు మరో కొత్త మలుపు తిరగనున్నాయి. తాజా ఫలితాలతో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
Also Read..
సినీ రంగం నుంచి టీవీకే వరకు.. విజయ్ తళపతి ప్రస్థానం..!
విజయ్ దెబ్బ.. స్టాలిన్ అబ్బ.. డీఎంకే ఓటమికి కారణాలు ఇవే..!
నేడు బెంగాల్.. రేపు తెలంగాణ.. ఒక్కొక్క రాష్ట్రంలో గెలుస్తూ వస్తం: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



