త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Actor Vijay | సినీ రంగం నుంచి టీవీకే వ‌ర‌కు.. విజ‌య్ త‌ళ‌ప‌తి ప్ర‌స్థానం..!

Actor Vijay | త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సినీ త‌ళ‌ప‌తి విజ‌య్ పెను సంచ‌ల‌నం సృష్టించారు. తొలిసారిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన విజ‌య్ ప్ర‌భుత్వం చేసే దిశ‌గా ముందుకు సాగుతున్నారు. త‌మిళ వెట్రి క‌జగం పార్టీ ప్ర‌స్తుతం 109 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

P

Entertainment | Published On May 4, 2026, 3.06 pm IST

Actor Vijay | సినీ రంగం నుంచి టీవీకే వ‌ర‌కు.. విజ‌య్ త‌ళ‌ప‌తి ప్ర‌స్థానం..!
Advertisement

Actor Vijay | త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సినీ త‌ళ‌ప‌తి విజ‌య్ పెను సంచ‌ల‌నం సృష్టించారు. తొలిసారిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన విజ‌య్ ప్ర‌భుత్వం చేసే దిశ‌గా ముందుకు సాగుతున్నారు. త‌మిళ వెట్రి క‌జగం పార్టీ ప్ర‌స్తుతం 109 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. 234 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 118 సీట్ల‌లో విజ‌యం సాధించాల్సి ఉంది. ప్ర‌స్తుత ట్రెండ్స్ ప‌రిశీలిస్తే టీవీకే పార్టీ త‌మిళ‌నాట అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించే అవ‌కాశం ఉంది. గ‌తంలో ఏ సినీ న‌టుడికి సాధ్యం కాని విధంగా పార్టీని స్థాపించి కొద్దిరోజుల‌కే జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం కేవ‌లం విజ‌య్‌కే ఈ ఘ‌న‌త ద‌క్కింది.

బ‌యోగ్ర‌ఫీ..

కె జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ త‌ళ‌ప‌తి విజ‌య్ 1974 జూన్ 22న జన్మించారు. సినీ నిర్మాత అయిన ఎస్ఏ చంద్ర‌శేఖ‌ర్‌, సింగ‌ర్ శోభా చంద్ర‌శేఖ‌ర్ దంప‌తుల‌కు జ‌న్మించాడు. చిన్న‌త‌నంలోనే సినిమాల్లోకి విజ‌య్ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్‌లో తొలిసారిగా బాల న‌టుడిగా క‌నిపించాడు. 1980ల‌లో బాల నటుడిగా ప‌లు చిత్రాల్లో న‌టించాడు. 1992లో ‘నాలయ్య తీర్పు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. ఆ త‌ర్వాత తర్వాత 1993లో ‘సెందూరపాండి’ సినిమాతో మళ్లీ అవకాశాన్ని అందుకుని గుర్తింపు పొందారు. 1994లో ‘రసిగన్’ విడుదల సమయంలో అభిమానులు ‘ఇలయ తలపతి’ మారాడు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ను అభిమానులు త‌ల‌ప‌తి విజ‌య్‌గా పిలుచుకుంటారు. కొద్ది కాలంలో విజ‌య్ త‌మిళంలో స్టార్ హీరోగా ఎదిగాడు. ‘మాస్టర్’, ‘మెర్సల్’, ‘సర్కార్’, ‘బిగిల్’ వంటి చిత్రాలు ఆయనకు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచారు. సామాజిక స‌మ‌స్య‌లు, అవినీతి, రైతు స‌మ‌స్య‌లు త‌దిత‌ర అంశాల‌ను సినిమాల్లో ప్ర‌స్తావించ‌డంతో యువ‌త‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

సామాజిక సేవ‌లో..

విజయ్ అభిమాన సంఘాలు ‘విజయ్ మక్కల్ ఇయ్యక్కం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. దాంతో విజ‌య్‌కి మంచి గుర్తింపు వ‌చ్చింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సంఘానికి చెందిన అభ్యర్థులు ప‌లుచోట్ల విజ‌యం సాధించారు. దాంతో పొలిటిక‌ల్ ఎంట్రీకి ఇదే కీల‌క సంకేతంగా భావించారు. 2009 నుంచే అభిమాన సంఘాలను వ్యవస్థీకరించడంతో విజయ్ రాజకీయ పునాదికి వేసుకుంటూ ముందుకు సాగిన‌ట్లుగా ప‌రిశీలకులు పేర్కొంటున్నారు. 2011లో ఆయన అన్నాడీఎంకే కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం సైతం రాజ‌కీయ ప్ర‌యాణంలో తొలి అడుగుగా పేర్కొంటున్నారు. అలాగే, ఏటా ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌లో రాణించిన విద్యార్థుల‌కు ఆర్థికంగా చేయూత‌నివ్వ‌డంతో పాటు వారిని ప్ర‌త్యేకంగా స‌న్మానిస్తుంటారు. అలాగే, త‌మిళ‌నాడులో ఎక్కువ‌గా తుఫాన్లు వ‌చ్చే విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎంత మంది ఆర్థికంగా అండ‌గా నిలిచారు. దాంతో విజ‌య్‌కి సామాన్యుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

టీవీకే పార్టీ ఏర్పాటు..

2024 ఫిబ్రవరిలో విజయ్ అధికారికంగా తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించారు. అదే సమయంలో సినిమాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. జ‌న‌నాయ‌గ‌న్ పార్టీ త‌న చివ‌రి సినిమా అని ఆ స‌మ‌యంలో వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల‌పైనే దృష్టి సారించారు. టీవీకే పార్టీని సొంతంగా తీర్చిదిద్దుకున్నారు. ఎలాంటి ముంద‌స్తు కూట‌ములు లేకుండానే ఎన్నిక‌ల్లో పోటీ చేసేలా నిల‌బెట్టారు. అవినీతి వ్యతిరేకత, ఉద్యోగావకాశాలు, విద్య, పరిపాలనా పారదర్శకత వంటి అంశాలే త‌న ప్రధాన అజెండాగా ప్రకటించారు. 2024 అక్టోబర్‌లో నిర్వ‌హించిన ర్యాలీలో విజయ్ తొలిసారిగా రాజకీయ నేత‌గా మారారు. ఆ స‌భ‌కు ల‌క్ష‌లాది మంది జ‌నం హాజ‌ర‌య్యారు.

ఎన్నిక‌ల వ్యూహం.. ప్ర‌భావం..

టీవీకే గత రెండేళ్లలో జిల్లా స్థాయి కమిటీలు, బూత్ స్థాయి నిర్మాణాలను బలోపేతం చేస్తూ వ‌చ్చింది. సోషల్ మీడియా వేదిక‌గా ప్రచారం చేస్తూ యువ‌త‌ను ఆక‌ర్షించింది. కొన్ని ఘటనల్లో జరిగిన లోపాలు, ఉదాహరణకు 2025లో కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, పార్టీ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఆ స‌మ‌యంలో విజ‌య్ పార్టీ న‌డిపిన తీరును విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో ప్ర‌భుత్వం సైతం ప‌లు ఆంక్ష‌లు విధిస్తూ వ‌చ్చాయి. క‌రూర్ తొక్కిస‌లాట కేసులో సీబీఐ విచార‌ణ‌కు సైతం హాజ‌ర‌య్యారు.

తమిళనాడు కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు..

1967 నుంచి తమిళనాడు రాజకీయాలు ప్రధానంగా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల చుట్టూ తిరుగుతూ వచ్చాయి. ఎంజీఆర్, జయలలిత వంటి సినీ ప్రముఖులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినా, కొత్తగా పార్టీని స్థాపించి నేరుగా అధికారంలోకి వచ్చిన సందర్భం చాలా అరుదు. ఎంజీఆర్ 1977లో అధికారంలోకి వచ్చి దశాబ్దకాలం పాలించారు. ఆ త‌ర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, కొత్త‌గా రాజకీయ పార్టీ స్థాపించి ఓ సినీ న‌టులు అధికారంలోకి వ‌చ్చిన చ‌రిత్ర లేదు. ఎంతో మంది అభిమానులు ఉన్న విజ‌య్ మాత్రం ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి న‌టుడిగా స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించ‌బోతున్నాడు.

Advertisement
Advertisement