Alleti Maheshwar Reddy | నేడు బెంగాల్.. రేపు తెలంగాణ.. ఒక్కొక్క రాష్ట్రంలో గెలుస్తూ వస్తం: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Alleti Maheshwar Reddy | మొన్నఢిల్లీ.. నేడు పశ్చిమ బెంగాల్ (Bengal).. రేపు తెలంగాణ(Telangana) లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బెంగాల్ ప్రజలు దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డారని పేర్కొన్నారు.
- రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేస్తం
- ఈనెల 10న మోదీ అదే సంకేతాన్ని ఇవ్వబోతున్నారు
- బెంగాలీలు ధర్మం వైపు నిలబడ్డారు
- ఇండియా కూటమికి వ్యతిరేక ఫలితాలు సంతోషకరం
- మీడియా సమావేశంలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు
Alleti Maheshwar Reddy | త్రినేత్ర.న్యూస్: మొన్నఢిల్లీ.. నేడు పశ్చిమ బెంగాల్ (Bengal).. రేపు తెలంగాణ(Telangana) లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈనెల 10న ప్రధాని మోదీ (PM Modi) తెలంగాణకు వస్తున్నారని.. ఇక్కడ దిశా నిర్దేశం చేసి రాబోయే ఎన్నికల్లో భాజపా (BJP) ప్రభుత్వం గెలుస్తుందనే సంకేతాన్ని ఇవ్వబోతున్నారన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగాల్ ప్రజలు దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డారని పేర్కొన్నారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్..
భాజపా అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో ప్రజాధరణ పొందుతుందని ప్రధాని మోదీ ఆనాడే చెప్పారు. ఒక్కొక్కటిగా మనం చూస్తున్నం. మొన్నటికి మొన్న మహారాష్ట్ర, ఢిల్లీ, నేడు బెంగాల్. మన చుట్టూ ఉన్న ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా గెలుస్తూ వస్తున్నం. మోదీ ఒక్కొక్కటిగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటున్నారు. రేపు 10వ తేదీన కూడా తెలంగాణకు వస్తున్నారు. ఇక్కడ దిశా నిర్దేశం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేసి తీరుతామని వారు సంకేతాన్ని ఇవ్వబోతున్నరు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రజలు కోరుకుంటున్న బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో రాబోతోంది అని ఏలేటి వ్యాఖ్యానించారు.
ఒడిశాలో ముచ్చటగా మూడోసారి..
ఏ రాష్ట్రం కోసమైతే ప్రజలు కొట్లాడారో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అంతా అతలాకుతలమైంది. ఆశలన్నీ ఆడియాశలైతున్న తరుణంలో నేను మీకున్నా అని చెప్పి ప్రధాని మోదీ ఇక్కడికి వస్తున్నారు. రేపు తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తుంది. తమిళనాడులో ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఫలితాలు రావడం సంతోషకరం. ఒడిశాలో ముచ్చటగా మూడోసారి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నం. పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం మరోసారి స్పష్టమైంది.
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..
35 శాతం మైనారిటీలున్న ఒడిశాలో, 30 శాతం మైనారిటీలున్న అసోంలో కూడా భాజపా పాగా వేస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మోదీపై ఉన్న నమ్మకంగా అభివర్ణిస్తున్నాం. నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమికి వ్యతిరేక పవనాలు వీచాయి. దేశం కోసం, ధర్మం కోసం భాజపాకు అండగా నిలబడ్డ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా అని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



