Padmavathi Ammavari Brahmotsavams | డిసెంబర్‌లో తిరుమల వెళ్తున్నారా..? తిరుచానూరులో జరిగే ఉత్సవాల గురించి తెలుసా?
Padmavathi Ammavari Brahmotsavams | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పాంచరాత్ర ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం నవాహ్నిక దీక్షతో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, రాత్రి అమ్మవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Devotional | Published On Nov 28, 2026, 4.00 pm IST
- డిసెంబర్ 6 నుంచి 14 వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు
- 11న స్వర్ణరథం, గరుడ వాహనసేవ.. 14న పంచమీ తీర్థం
Padmavathi Ammavari Brahmotsavams | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పాంచరాత్ర ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం నవాహ్నిక దీక్షతో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, రాత్రి అమ్మవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందుగా డిసెంబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ క్రతువును చేపడతారు. డిసెంబర్ 5న ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. మరుసటి రోజు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
తొమ్మిది రోజులూ వాహనసేవల వైభవం
ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహించనున్నారు. తొలిరోజైన డిసెంబర్ 6న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చిన్నశేష వాహనసేవ జరుగుతుంది. 7న ఉదయం పెద్దశేష వాహనం, రాత్రి హంస వాహనంపై అమ్మవారు విహరిస్తారు. 8న ముత్యపుపందిరి, సింహ వాహనాలపై దర్శనమిస్తారు. డిసెంబర్ 9న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు. 10న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజ వాహనసేవ ఉంటుంది. 11న ఉదయం సర్వభూపాల వాహనంపై అమ్మవారు ఊరేగనుండగా, రాత్రి స్వర్ణరథం, గరుడ వాహనసేవలు నిర్వహించనున్నారు. 12న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనసేవలు జరగనున్నాయి. 13న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనసేవ నిర్వహిస్తారు. చివరి రోజైన డిసెంబర్ 14న ఉదయం పంచమీ తీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరుసటి రోజు డిసెంబర్ 15న పుష్పయాగం నిర్వహించనున్నారు.
బంగారు పద్మంలో అమ్మవారి ఆవిర్భావం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విశేషమైన స్థలపురాణం ఉంది. ఆలయం వెనుక ఉన్న పద్మసరోవర పుష్కరిణిలో బంగారు పద్మం నుంచి అమ్మవారు ఆవిర్భవించినట్లు పురాణ ప్రతీతి. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి తొలుత పద్మావతిపురం అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో అది తిరుచానూరుగా మారిందని చెబుతారు. స్థలపురాణం ప్రకారం శ్రీమహావిష్ణువు 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా, కార్తీక మాస శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో అమ్మవారు బంగారు పద్మంలో ఆవిర్భవించారు. ఈ పవిత్ర ఘట్టానికి గుర్తుగా పంచమి తీర్థానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అమ్మవారి ఆవిర్భావ దినానికి తొమ్మిది రోజుల ముందు నుంచే శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పంచమి తీర్థానికి విశేష ప్రాధాన్యం
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరిగే పంచమి తీర్థం భక్తులకు అత్యంత విశిష్టమైన ఘట్టం. ఈ సందర్భంగా పద్మసరోవరంలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే సప్త సముద్రాలు, ముక్కోటి తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తిరుచానూరుకు చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు చక్రస్నానంలో పాల్గొంటారు. ఇదిలా ఉడగా.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పలు సేవలను రద్దు చేసింది. డిసెంబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు, కుంకుమార్చన, బ్రేక్ దర్శనాలు ఉండవు. డిసెంబర్ 5 నుంచి 16వ తేదీ వరకు ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..
- ●MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ
- ●Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!
- ●Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్
- ●Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి
- ●Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం

India Exports | ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డు.. 45 శాతం వృద్ధి..

MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ

Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!

Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్






