TTD | శ్రీవారి భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల!
TTD | వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను ప్రకటించింది.
Devotional | Published On Nov 27, 2026, 5.39 pm IST
- నవంబర్ 28న శ్రీవాణి టికెట్లు..
- 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
- డిసెంబర్ 1 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లకు ఈ-డిప్
- తొలి రెండు రోజులు రూ.300 టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
TTD | వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను ప్రకటించింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన టికెట్లు పొందేందుకు వీలుగా ముందస్తు షెడ్యూల్‌ను వెల్లడించింది.
30న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు..
ఈ నెల 28న ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది. నవంబర్ 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఈ-డిప్ నమోదు ప్రక్రియ నిర్వహించనుంది. డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ-డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు డిసెంబర్ 7న మధ్యాహ్నం 3 గంటలకు టోకెన్లు కేటాయించనున్నారు. అలాగే డిసెంబర్ 8న ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నారు.
తొలి రెండు రోజులు ప్రత్యేక ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ రెండు రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఈ రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానంలో ఆన్‌లైన్ ద్వారా కేటాయించనుంది. భక్తులు దర్శన టికెట్లు, టోకెన్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అనధికారిక వెబ్‌సైట్లు, ఇతర మార్గాల్లో టికెట్లు పొందే ప్రయత్నం చేయవద్దని కోరింది. దర్శన తేదీలు, టికెట్ల విడుదల సమయాలను ముందుగానే గమనించాలని విజ్ఞప్తి చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



