Khawaja Asif | పీవోకే నిరసనకారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Khawaja Asif | ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పీవోకే నిరసనకారులను భారత్‌తో సమానంగా శత్రువులుగా చూస్తామంటూ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
International | Published On Jul 29, 2026, 11.20 am IST
Khawaja Asif | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నిరసనలు కొనసాగుతున్న వేళ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పీవోకే నిరసనకారులను భారత్‌తో సమానంగా శత్రువులుగా చూస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడిన ఆసిఫ్.. ఆందోళనకారులపై కాల్పులు జరపడాన్ని గట్టిగా సమర్థించారు. పీఓకేలో నిరసన తెలుపుతున్నవారికి, భారతదేశానికి మధ్య ఎలాంటి తేడా లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆందోళన చేస్తున్న వారితో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. వారిని పాకిస్థాన్ శత్రువులుగా అభివర్ణించారు.
పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది మరో 10 రోజుల వరకూ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో 45 స్థానాలకు గాను 12 స్థానాలను పాక్‌లో నివసిస్తున్న కశ్మీర్ శరణార్థులకు రిజర్వ్ చేయడాన్ని జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (Joint Awami Action Committee) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వతంత్ర ప్రతిపత్తిని అణచివేసేందుకు పాక్ కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌లను తీసుకొచ్చిందని జేఏఏసీ ఆరోపిస్తోంది. పీవోకేను తన నియంత్రణలో పెట్టుకునేందుకు పాక్ అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని మండిపడుతోంది. పాక్ పాలకుల నిర్ణయానికి వ్యతిరేకంగా జేఏఏసీ జూన్ 5 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. ఈ ఆందోళనల సందర్భంగా నిరసనకారులపై పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకూ 100 మంది వరకూ కార్యకర్తలు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా వెల్లడిస్తోంది.
Also Read..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు లక్కీ చాన్స్..
ఉప్పొంగుతున్న బొగత జలపాతం.. పర్యాటకుల సందర్శన నిలిపివేత
700 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ..
సంబంధిత వార్తలు

Blast Near Mosque | మసీదులో భారీ పేలుడు.. 15 మంది మృతి
సెప్టెంబర్ 18, 2026

UNSC | 9/11 సూత్రధారులు గుహల్లో దాక్కోలేదు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను మరోసారి ఎండగట్టిన భారత్
సెప్టెంబర్ 17, 2026

Hindu Temple Demolition | పాక్‌లో మదర్సా కోసం వందేండ్లనాటి గుడి కూల్చివేత.. ఖండించిన భారత్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!



