ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి
ACB Raids | ఎన్ని దాడులు జరుగుతున్నా అవినీతి అధికారుల్లో మార్పు వచ్చేలా లేదు. నిన్న గాక మొన్న ఓ తహసీల్దార్, హాస్టల్ వార్డెన్ ఏసీబీకి చిక్కిన ఘటన మరవకముందే మరో ఇద్దరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయి
ACB Raids | త్రినేత్ర.న్యూస్: ఎన్ని దాడులు జరుగుతున్నా అవినీతి అధికారుల్లో మార్పు వచ్చేలా లేదు. నిన్న గాక మొన్న ఓ తహసీల్దార్, హాస్టల్ వార్డెన్ ఏసీబీకి చిక్కిన ఘటన మరవకముందే మరో ఇద్దరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జూనియర్ అసిస్టెంట్ పాల్డా అశోక్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి కలకుంట్ల కిరణ్ కుమార్ సోమవారం ఉదయం లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలోని ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పాల్డా అశోక్ (AO-1) జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆడిట్ విభాగంలో కలకుంట్ల కిరణ్ కుమార్ (AO-2) ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఓ వ్యక్తి తల్లి సర్వీస్ బుక్‌లో అవసరమైన ఎంట్రీలు, వివరాలు నమోదు చేసి, ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేయడం, నెలవారీ పెన్షన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేయడం కోసం లంచం డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణంలోని రాజా రాజేంద్ర చౌరస్తా సమీపంలోని పద్మశాలి సంఘం, సీతారామనగర్ కాలనీ వద్ద ఫిర్యాదుదారుడి నుంచి రూ.15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని SPE అండ్ ACB కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు.
ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే నేరుగా తమను సంప్రదించాలని, అటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్-1064, వాట్సాప్: 94404 46106 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజావార్తలు
- ●Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్





