Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
Snapana Tirumanjanam | తెల్ల ముత్యాల మెరుపులు.. వట్టివేరు, కురువేరు సుగంధాలు.. పూల పరిమళాలు.. వేదమంత్ర ఘోషలు.. వెరసి తిరుమల కొండపై సోమవారం ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
Devotional | Published On Sep 21, 2026, 7.21 pm IST
Snapana Tirumanjanam | తెల్ల ముత్యాల మెరుపులు.. వట్టివేరు, కురువేరు సుగంధాలు.. పూల పరిమళాలు.. వేదమంత్ర ఘోషలు.. వెరసి తిరుమల కొండపై సోమవారం ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అర్చకులు వైఖానస ఆగమ పద్ధతిలో అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు.

ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారు, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో పంచామృత అభిషేకం నిర్వహించారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం చేశారు.

వేద మంత్రాలతో మార్మోగిన మండపం
స్నపన తిరుమంజనం సందర్భంగా టీటీడీ వేద పారాయణదారులు ఉపనిషత్, దశశాంతి మంత్రాలతోపాటు పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్తాలను పఠించారు. అభిషేకం అనంతరం పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్‌లు పలు దివ్య పాశురాలను పారాయణం చేశారు. తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు, పసుపు రేకులు, రోజాలు, బటన్ చామంతి మాలలతో మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవిని విశేషంగా అలంకరించారు. పూల సౌరభం, సుగంధ పరిమళాలు, వేదఘోషలతో రంగనాయకుల మండపం భక్తి భావంతో నిండిపోయింది. కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే
- ●ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి
- ●Agarkar Vs BCCI | అగార్కర్–బీసీసీఐ మధ్య విభేదాలు.. తెరపైకి కీలక విషయాలు..!
- ●Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం

Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే

ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి

Agarkar Vs BCCI | అగార్కర్–బీసీసీఐ మధ్య విభేదాలు.. తెరపైకి కీలక విషయాలు..!





