CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళన
CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వరకు మార్చ్ నిర్వహించారు. ఠాణా ఎదురుగా ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
CJP | హిందుత్వ కార్యకర్తను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వరకు మార్చ్ నిర్వహించారు. ఠాణా ఎదురుగా ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంతర్‌మంతర్ వద్ద జులై 20న జరిగిన ఆందోళనలో పాల్గొన్న విద్యార్థిని తండ్రి సంజయ్ కుమార్‌పై దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందుత్వ కార్యకర్త భరద్వాజ్‌ను అరెస్టు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, కోకన్వీనర్ ఆశుతోష్ రంకాతో పాటు పలువురు కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. జులై 20న జరిగిన ఘటనకు సంబంధించి భరద్వాజ్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి నెట్టింట వైరల్ కావడంతో సీజేపీ ఆందోళనకు దిగింది.
Hindutva extremist Swatantra Bhardwaj spoke about attacking the father of a CJP protester during a podcast.
He said that the man received 60 stitches and was on the verge of death, adding that “a Section 307 case was warranted,” yet he walked out within a day after a call from… pic.twitter.com/TqgBEw8Twz
— Sarcastic. (@Sarcaztick) September 2, 2026
ఆ ఇంటర్వ్యూలో సంజయ్‌కుమార్‌పై దాడి చేసినట్లుగా భరద్వాజ్ చెప్పినట్లు సీజేపీ ఆరోపించింది. ఘటన తర్వాత తాను అరెస్టు కాలేదని, రాత్రంతా బయటే తిరిగానని అతను చెప్పినట్లు పేర్కొంది. సంజయ్‌కుమార్‌పై దాడి అనంతరం హత్యాయత్నం సెక్షన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనలను వర్తింపజేయాలని పోలీసులను కోరినట్లు సౌరవ్ దాస్ తెలిపారు. పోలీసులు తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆరోపించారు. తీవ్ర గాయాలకు సంబంధించిన సెక్షన్‌ను చేర్చాలని కోరగా.. కోర్టును ఆశ్రయించి ఆదేశాలు తీసుకురావాలని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆందోళనలో ఓ విద్యార్థిని మొదటి నుంచి తమ నిరసన కార్యక్రమాల్లో భాగమైందని.. ఆమె తండ్రి సంజయ్‌కుమార్ సైతం ఆమెతో కలిసి వచ్చేవారని దాస్ తెలిపారు.
VIDEO | Delhi: CJP spokesperson Saurav Das, co-convenor Ashutosh Ranka and others proceed to Parliament Street Police Station from Patel Chowk in connection with a case regarding injuries to one of their supporters during Jantar Mantar protests. Saurav Das says, "There is a minor… pic.twitter.com/0Lw5aYnFkv
— Press Trust of India (@PTI_News) September 4, 2026
జులై 20న కొందరు వ్యక్తులు నిరసన ప్రదేశంలోకి ప్రవేశించడంతో ఘర్షణ చోటుచేసుకుందని, ఆ సమయంలో సంజయ్‌కుమార్‌పై దాడి జరిగిందని ఆరోపించారు. ఘటనలో పాల్గొన్న ఇతరులను గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, సంజయ్‌కుమార్ పుర్రెకు పగులు ఏర్పడినట్లు వచ్చిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఘర్షణలో ఆయనకు స్వల్ప గాయమైందని తెలిపారు. సంజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. సీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kavitha | నేనూ సీఎం అవుతా.. ఆ హోదాకు గౌరవం ముఖ్యం
- ●Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..
- ●Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
- ●Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!
- ●KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం
- ●Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు.. ఫ్రెండ్‌కి మోదీ కంగ్రాట్స్

Kavitha | నేనూ సీఎం అవుతా.. ఆ హోదాకు గౌరవం ముఖ్యం

Adobe | అడోబ్ కొత్త సీఈవోగా అనిల్ చక్రవర్తి.. ఐఐటీ నుంచి టెక్ దిగ్గజం వరకు..

Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..

Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!





