IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది.. సీఎస్‌కే కొత్త హెచ్‌కోచ్‌గా జహీర్ ఖాన్..!
IPL 2027 | చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో కీలక మార్పు చోటుచేసుకుంది. మాజీ టీమిండియా పేసర్ జహీర్ ఖాన్‌ను జట్టు హెడ్ కోచ్‌గా నియమించింది. సోమవారం సోషల్ మీడియా వేదికగా సీఎస్‌కే ఈ విషయాన్ని ప్రకటించింది. 2026 ఐపీఎల్ సీజన్ అనంతరం స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో పరస్పర అంగీకారంతో విడిపోయిన ఫ్రాంచైజీ.. అతడి స్థానంలో జహీర్‌కు బాధ్యతలు అప్పగించింది.
IPL 2027 | చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో కీలక మార్పు చోటుచేసుకుంది. మాజీ టీమిండియా పేసర్ జహీర్ ఖాన్‌ను జట్టు హెడ్ కోచ్‌గా నియమించింది. సోమవారం సోషల్ మీడియా వేదికగా సీఎస్‌కే ఈ విషయాన్ని ప్రకటించింది. 2026 ఐపీఎల్ సీజన్ అనంతరం స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో పరస్పర అంగీకారంతో విడిపోయిన ఫ్రాంచైజీ.. అతడి స్థానంలో జహీర్‌కు బాధ్యతలు అప్పగించింది. సీఎస్‌కేకు ఫ్లెమింగ్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2008లో తొలి ఐపీఎల్ సీజన్‌లో ఆటగాడిగా చెన్నై జట్టుతో కలిసిన ఫ్లెమింగ్.. 2009లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి మార్గదర్శకత్వంలో సీఎస్‌కే ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది. మొత్తంగా 12 సార్లు ప్లేఆఫ్స్‌కు, 10 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది.
సీఎస్‌కేకు పునరుత్తేజం..
2023లో చివరిసారిగా ఐపీఎల్ విజేతగా నిలిచిన సీఎస్‌కే.. ఆ తర్వాత వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు దూరమైంది. 2024లో ఐదో స్థానంలో నిలిచిన చెన్నై.. 2025లో పదో స్థానంతో అట్టడుగుకు చేరింది. 2026లో ఎనిమిదో స్థానంతో లీగ్ దశకే పరిమితమైంది. దీంతో 2027 సీజన్‌కు ముందే కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేసి పునరాగమనానికి సిద్ధమవుతోంది. 2017లో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జహీర్ పలు జట్లతో విభిన్న బాధ్యతల్లో పనిచేశాడు. ఆర్‌సీబీ, ముంబయి, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఫాస్ట్ బౌలర్.. 2019 సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత గ్లోబల్ డెవలప్‌మెంట్ హెడ్‌గా పనిచేశాడు. 2025 ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన జహీర్.. ఆ తర్వాత ఆ ఫ్రాంచైజీతో విడిపోయాడు. 100 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన జహీర్ 27.27 సగటుతో 102 వికెట్లు పడగొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్ తరఫున 610 వికెట్లు తీసుకున్న అనుభవం ఉన్నది. ఇప్పుడు సీఎస్‌కేను తిరిగి విజయాల బాట పట్టించే బాధ్యతను జహీర్ తన భుజాలకెత్తుకున్నాడు.
ZAK HERE FOR THE PRIDE! 🦁#WhistlePodu for the Head Coach of Chennai Super Kings! 🥳💛
Read more, Link -https://t.co/v8muYn4yVA pic.twitter.com/eQChQ6yDEB
— Chennai Super Kings (@ChennaiIPL) September 21, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 21, 2026

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
సెప్టెంబర్ 21, 2026

Agarkar Vs BCCI | అగార్కర్–బీసీసీఐ మధ్య విభేదాలు.. తెరపైకి కీలక విషయాలు..!
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే

Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం



