త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cockroach Janta Party | ఈ ప్ర‌భుత్వానికి ఇంకెంత‌కాలం భ‌య‌ప‌డాలి..?.. కాక్రోచ్ పార్టీ

Cockroach Janta Party | దేశ విద్యా వ్యవస్థలో వైఫ‌ల్యాల‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janta Party) నేడు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌కు దిగింది. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

D

National | Published On Jun 6, 2026, 3.40 pm IST

Cockroach Janta Party | ఈ ప్ర‌భుత్వానికి ఇంకెంత‌కాలం భ‌య‌ప‌డాలి..?.. కాక్రోచ్ పార్టీ
Advertisement

Cockroach Janta Party | దేశ విద్యా వ్యవస్థలో వైఫ‌ల్యాల‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janta Party) నేడు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌కు దిగింది. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ప్ర‌భుత్వానికి ఇంకెంత కాలం మ‌నం భ‌య‌ప‌డాలి..? అంటూ ప్ర‌శ్నించారు. ఈ నిర‌స‌న‌ల కార‌ణంగా ప్ర‌భుత్వం త‌న‌ను జైల్లో పెడుతుందేమోన‌ని త‌న త‌ల్లి ఎంత‌గానో భ‌య‌ప‌డింద‌ని తెలిపారు. మ‌న దేశంలో ఈ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా త‌మ పిల్ల‌లు గొంతు విప్పిన‌ప్పుడు ప్ర‌తీ త‌ల్లికీ ఇదే భ‌యం క‌లుగుతుంద‌ని వ్యాఖ్యానించారు. "ఈ ప్రభుత్వానికి భయపడుతూ మనం ఇంకెంత కాలం బతకాలి?" అని ఆయన ప్ర‌శ్నించారు.

రాజీనామా చేయ‌క‌పోతే దేశ వ్యాప్త నిర‌స‌న‌లే..

ఇదిలా ఉండ‌గా.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు కాక్రోచ్ పార్టీ డెడ్ లైన్ విధించింది. ఈరోజు సాయంత్రం లోపు రాజీనామా చేయ‌క‌పోతే దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లు చేప‌డ‌తామ‌ని ఆ పార్టీ చీఫ్ దిప్కే హెచ్చ‌రించారు. వ‌చ్చే వారం రోజుల్లో ప‌లు న‌గ‌రాల్లో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి.. వాంగ్‌చుక్‌

ఇదిలా ఉండ‌గా కాక్రోచ్ పార్టీకి మ‌ద్ద‌తుగా సామాజిక కార్యకర్త, ఉద్య‌మ కారుడు సోన‌మ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) కూడా నిర‌స‌న‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకొని ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. "నాకు నిరసనలు తెలపడం ఇష్టం లేదు. కానీ న్యాయం కోసం తప్పడం లేదు" అని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద మాట్లాడుతూ వాంగ్‌చుక్‌ అన్నారు. అంతేకాదు, మ‌న దేశ విద్యా విధానంలో మార్పులు రావాల‌ని పేర్కొన్నారు.

వాంగ్‌చుక్ విద్యామంత్రిగా ఉండాలి

ఈ సంద‌ర్భంగా వాంగ్‌చుక్ విద్యాశాఖ మంత్రిగా ఉండాల‌ని ప‌లువురు విద్యార్థులు కోరారు. అయితే, అందుకు ఆయ‌న నిరాక‌రించారు. త‌న‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. యువ‌తే త‌గిన బాధ్య‌త తీసుకోవాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

Also Read..

ఎన్టీఆర్ స్టేడియంలో జూన్ 12 నుంచి రైతు మిత్ర అగ్రి షో..

ద‌మ్ముంటే నీవు కొడంగ‌ల్‌లో గెలువు.. రేవంత్‌కు ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి స‌వాల్

స్త్రీ రైడర్లు వస్తున్నారు.. 55 మందికి డ్రైవింగ్‌ లైసెన్సులు అందించిన‌ డీజీపీ

Advertisement
Advertisement