త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Anand| స్త్రీ రైడర్లు వస్తున్నారు.. 55 మందికి డ్రైవింగ్‌ లైసెన్సులు అందించిన‌ డీజీపీ

DGP Anand | మహిళల భద్రత, సాధికారతే లక్ష్యంగా స్త్రీ రైడ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. తొలి విడతలో 55 మంది మహిళలకు స్త్రీ రైడర్లుగా అవకాశం ఇచ్చిన‌ట్లు చెప్పారు.

S

Hyderabad | Published On Jun 6, 2026, 3.15 pm IST

DGP Anand| స్త్రీ రైడర్లు వస్తున్నారు.. 55 మందికి డ్రైవింగ్‌ లైసెన్సులు అందించిన‌ డీజీపీ
Advertisement

DGP Anand| త్రినేత్ర‌.న్యూస్‌: మహిళల భద్రత, సాధికారతే లక్ష్యంగా స్త్రీ రైడ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా విమెన్ సేఫ్టీ వింగ్ ఈ ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టిందన్నారు. తొలి విడతలో 55 మంది మహిళలకు స్త్రీ రైడర్లుగా అవకాశం ఇచ్చిన‌ట్లు చెప్పారు. మహిళలు డ్రైవింగ్ చేయాలంటే కుటుంబ సహకారం ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. పోలీసు శాఖలో సైతం మహిళా అధికారులకు సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.

మహిళల భద్రతకు సంబంధించి స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం 55 టూ వీలర్, నాలుగు ఆటో రైడ్స్‌ను ప్రారంభిస్తున్నాం. జొమాటో, స్విగ్గీ లాంటి డెలివరీలలో మగవాళ్ల‌ను చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మహిళలు రైడ్ సర్వీస్‌లకు ముందుకు రావడం శుభపరిణామం. మహిళలు డ్రైవింగ్ చేయాలంటే కుటుంబ సహకారం చాలా అవసరం. గత కొంత కాలంగా మహిళలకు సపోర్ట్ తగ్గడంతో క్యాబ్ సర్వీస్‌ల నుంచి వైదొలిగారు. పోలీసు శాఖలో సైతం మహిళా అధికారులకు సమస్యలు ఎదురయ్యాయి అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

ప్రస్తుతం డ్రైవర్లగా నియమితులైన మహిళలు కష్టాలను దాటుకుంటూ ధైర్యంగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో మహిళా రైడర్స్ సంఖ్యను పెంచే విధంగా వీరు స్ఫూర్తి నింపాలి. మహిళలు ఎస్‌హెచ్‌వో పోస్టులు చేపట్టాలి. ఇంట్లో ఉన్న మగవాళ్ల సహకారం ఉండాలని గుర్తించాం. ఇందుకోసం 'స్టాండ్‌ విత్‌ హర్‌' అనే కార్యక్రమం చేపట్టాం. చిన్న చిన్న‌ కష్టాలు వస్తే వెనకడుకు వేయొద్దు అని డీజీపీ సూచించారు.

అంబ‌ర్‌పేట్ పోలీస్ లైన్‌లో శిక్ష‌ణ‌...

అంబర్‌పేట్ పోలీస్ లైన్‌లో టూ వీలర్, త్రీ వీలర్ డ్రైవింగ్ నైపుణ్యాల్లో మహిళలకు ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు. అనంతరం 55 మంది మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు.

Advertisement
Advertisement