త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cockroach Janta Party | కాక్రోచ్ పార్టీ నిరసనకు ఢిల్లీ పోలీసుల అనుమతి.. బుక్‌, జాతీయ జెండాతో రావాల‌ని అభిజీత్ పిలుపు

Cockroach Janta Party | నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ శనివారం ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు (Delhi Police) అనుమతి ఇచ్చారు.

D

National | Published On Jun 6, 2026, 11.32 am IST

Cockroach Janta Party | కాక్రోచ్ పార్టీ నిరసనకు ఢిల్లీ పోలీసుల అనుమతి.. బుక్‌, జాతీయ జెండాతో రావాల‌ని అభిజీత్ పిలుపు
Advertisement

Cockroach Janta Party | దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలు, నీట్ పరీక్ష, సీబీఎస్‌ఈ ఫలితాలపై కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ శనివారం ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు (Delhi Police) అనుమతి ఇచ్చారు. ఈ విష‌యాన్ని కాక్రోచ్ పార్టీ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది.

మ‌రోవైపు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌ద్ద‌తుదారుల‌కు కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. శాంతియుతంగా, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఈ ఆందోళ‌న చేప‌ట్టాల‌ని కోరారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద క‌లిసేందుకు ఎదురుచూస్తున్న‌ట్లు ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు. నిర‌స‌న‌కు వ‌చ్చే వారు బుక్‌తో పాటు జాతీయ జెండాను ప‌ట్టుకుని రావాల‌ని సూచించారు. మ‌రోవైపు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. జంత‌ర్‌మంత‌ర్‌తోపాటూ సెంట్ర‌ల్ ఢిల్లీలోని ప‌రిస‌ర ప్రాంతాల్లో సుమారు 2,000 మంది పోలీసు సిబ్బంది మోహ‌రించారు.

కాగా, భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (CJI) సూర్య కాంత్ చేసిన "పరాన్నజీవులు" (parasites), "బొద్దింకలు" (cockroaches) వ్యాఖ్యలపై వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది యువత సోషల్ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి బొద్దింక‌ల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ సీజేఐ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌లు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదం నేప‌థ్యంలో మే 16న అభిజీత్ దిప్కే 'కాక్రోచ్ జనతా పార్టీ'ని (Cockroach Janata Party) ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది గంటల్లోనే, ఈ CJP సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతమైన ప్రజాదరణ పొంది, మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది.

కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కాన్వా (Canva) డిజైన్ల సహాయంతో రాత్రికి రాత్రే ఏర్పాటైన ఈ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ సోష‌ల్ మీడియాలో దూసుకెళ్తోంది. పార్టీ పెట్టిన వారం రోజుల్లోనే ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్‌ను సంపాదించి హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా బీజేపీ, కాంగ్రెస్ లాంటి దిగ్గ‌జ జాతీయ పార్టీల‌ను మించిపోయి.. దేశంలోనే అత్య‌ధిక ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్న రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించింది.

Also Read..

జ‌మ్ము క‌శ్మీర్ ఎప్ప‌టికీ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే.. ఐరాస‌లో పాక్ తీరును ఎండ‌గ‌ట్టిన భార‌త్‌

భార‌త్‌పై ఆంక్ష‌లు పెడితే.. అవ‌త‌లివారికే న‌ష్టం : పుతిన్‌

షియోమీ 17టి ఎంట్రీ.. లైకా కెమెరా, 6500ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకునే ఫ్లాగ్‌షిప్..

Advertisement
Advertisement