Cockroach Janta Party | సోషల్ మీడియాలో పోస్టులను చెరిపేయగలరేమో.. మమ్మల్ని కాదు : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్
Cockroach Janta Party | పరీక్షల్లో జరిగిన అక్రమాలపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్లను పరిష్కరించడం కంటే.. కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలపైనే కేంద్రం ఎక్కువగా దృష్టి పెట్టిందని కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) విమర్శించారు.
Cockroach Janta Party | దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలు, నీట్ పరీక్ష, సీబీఎస్‌ఈ ఫలితాలపై కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిరసన చేపట్టింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఆధ్వర్యంలో వేలాది మంది యువత జంతర్ మంతర్ వద్దకు చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు (CJP founder) అభిజీత్ మాట్లాడుతూ.. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్లను పరిష్కరించడం కంటే.. కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలపైనే కేంద్రం ఎక్కువగా దృష్టి పెట్టిందని విమర్శించారు. "స్నేహితులారా.. ఇది సుదీర్ఘ పోరాటం. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయబట్టి నెలరోజులవుతోంది. కానీ సిగ్గులేని వ్యక్తులు ఆ చర్య తీసుకోవడం లేదు. బదులుగా కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం, మా పోస్టులను డిలీట్ చేయించడం వంటి వాటిపై దృష్టి పెట్టారు. మీరు మా పోస్టులను డిలీట్ చేయగలరేమో.. కానీ, మమ్మల్ని తుడిచిపెట్టలేరు" అంటూ నిరసనకారులను ఉద్దేశించి అభిజీత్ అన్నారు.
దేశ యువత ఇకపై భయపడరు..
అంతేకాదు, దేశ యువత ఇకపై భయపడరని అభిజీత్ స్పష్టం చేశారు. "దేశ యువత ఇకపై భయపడరు. వారు పోరాడతారు. బొద్దింకలు కూడా భయపడవు.. అవి ఎప్పటికీ చావవు కూడా" అని అభిజీత్ వ్యాఖ్యానించారు.
देश का युवा अब डरेगा नहीं लड़ेगा
कॉकरोच डरते भी नहीं, कभी मरते भी नहीं #cjpprotest pic.twitter.com/BxUMDJv6Sl
— Cockroach is Back (@Cockroachisback) June 6, 2026
బొద్దింకలు వస్తున్నాయ్.. ధర్మేంద్ర రాజీనామా చెయ్
మనం విద్యా శాఖ మంత్రిని ఎన్నుకుని అక్కడికి పంపాము.. ఆయన మనం కట్టే పన్నుల నుంచే జీతం తీసుకుంటున్నారు. ఆయన పదవీకాలంలో లక్షలాది మంది యువత భవిష్యత్తు చీకటిమయమైంది. బొద్దింకలు వస్తున్నాయ్.. ధర్మేంద్ర రాజీనామా చెయ్ అంటూ కాక్రోచ్ పార్టీ హెచ్చరించింది.
धर्मेंद्र प्रधान इस्तीफ़ा दो!
शिक्षा मंत्री को हमने चुन कर भेजा है, हमारे टैक्स से उनको तनख्वाह मिलती है!
उनके शासन काल में करोड़ों युवाओं का भविष्य अंधकार में है।
cockroach आ रहे हैं, धर्मेंद्र प्रधान जा रहे हैं! #cjpprotest pic.twitter.com/LYcOUY7Shc
— Cockroach is Back (@Cockroachisback) June 6, 2026
ఉద్యమ కారుడు వాంగ్‌చుక్..
ఈ కార్యక్రమంలో వేలాది మంది యువత పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వామపక్ష విద్యార్థి సంఘాలైన 'ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్' (AISA), 'స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' (SFI)కి చెందిన పలువురు సభ్యులు కూడా హాజరయ్యారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నిరసనల్లో ఉద్యమ కారుడు సోనమ్ వాంగ్‌చుక్ కూడా హాజరుకానున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ తెలిపారు.
23న రాంలీలా మైదానంలో రెండో నిరసన..
నేడు జంతర్ మంతర్ వద్ద తొలి నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన కాక్రోచ్ పార్టీ.. త్వరలో మరో నిరసనకు సిద్ధమవుతోంది. ఈనెల 23న న్యూ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో పెద్ద ఎత్తున నిరసనకు ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని పార్టీ భావిస్తోంది.
Also Read..
కుక్ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీ హోటల్‌లో మంటలు.. వెలుగులోకి కీలక విషయాలు
ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
సంబంధిత వార్తలు

Cockroach Janta Party | ఈ ప్రభుత్వానికి ఇంకెంతకాలం భయపడాలి..?.. కాక్రోచ్ పార్టీ
జూన్ 6, 2026

Cockroach Janta Party | కాక్రోచ్ పార్టీ నిరసనకు ఢిల్లీ పోలీసుల అనుమతి.. బుక్, జాతీయ జెండాతో రావాలని అభిజీత్ పిలుపు
జూన్ 6, 2026

Ponnam Prabhakar | నీటిని ఆదా చేయండి.. భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Shares | మరో ప్రభుత్వ రంగ సంస్థలో షేర్లను విక్రయించనున్న కేంద్రం.. వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ అడుగులు..
- ●Niranjan Reddy | రేవంత్ పాలమూరుకొచ్చి పచ్చి అబద్దాలు చెప్పిండు
- ●Ranabaali | వంద రోజులు కంప్లీట్ చేస్తున్న రణబాలి - చెప్పిన డేట్కే థియేటర్లలోకి విజయ్, రష్మిక మూవీ
- ●Talasani Srinivas Yadav | ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీఆర్ఎస్దే : తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Jupiter Venus Conjunction | ఆకాశంలో అరుదైన 'కాస్మిక్ కిస్'.. సూర్యాస్తమయం తర్వాత కనువిందు చేయనున్న గురు, శుక్ర గ్రహాలు!
- ●Cockroach Janta Party | ఈ ప్రభుత్వానికి ఇంకెంతకాలం భయపడాలి..?.. కాక్రోచ్ పార్టీ

Shares | మరో ప్రభుత్వ రంగ సంస్థలో షేర్లను విక్రయించనున్న కేంద్రం.. వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ అడుగులు..

Niranjan Reddy | రేవంత్ పాలమూరుకొచ్చి పచ్చి అబద్దాలు చెప్పిండు

Ranabaali | వంద రోజులు కంప్లీట్ చేస్తున్న రణబాలి - చెప్పిన డేట్కే థియేటర్లలోకి విజయ్, రష్మిక మూవీ

Talasani Srinivas Yadav | ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీఆర్ఎస్దే : తలసాని శ్రీనివాస్ యాదవ్



