త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp | వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. స్కామ్‌ల‌ను ప‌సిగ‌డుతుంది..

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వ‌ర‌లో వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త ఫీచర్ స్కామ్ అలర్ట్. ఇది అనుమానాస్పద సందేశాలను గుర్తించి, వినియోగదారులను మోసాల నుంచి రక్షించడంలో సహాయపడనుంది.

S

Technology | Published On Jun 6, 2026, 5.27 pm IST

WhatsApp | వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. స్కామ్‌ల‌ను ప‌సిగ‌డుతుంది..
Advertisement

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వ‌ర‌లో వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త ఫీచర్ స్కామ్ అలర్ట్. ఇది అనుమానాస్పద సందేశాలను గుర్తించి, వినియోగదారులను మోసాల నుంచి రక్షించడంలో సహాయపడనుంది. ఫీచర్ ట్రాకర్ WABetaInfo వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫీచర్ ను వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.26.22.2లో గుర్తించారు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉండగా, భవిష్యత్ అప్‌డేట్ ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు అనుమానాస్పదంగా కనిపిస్తే, వాట్సాప్ చాట్‌లోనే ఒక హెచ్చరిక బ్యానర్‌ను చూపించనుంది. అందులో This may be a scam (ఇది మోసం కావచ్చు) అనే సందేశం కనిపించనుంది. అయితే చాట్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయకుండా, వినియోగదారుడే నిర్ణయం తీసుకునేలా సమాచారం అందిస్తుంది.

యూజ‌ర్ల‌కు రెండు ఆప్ష‌న్లు..

వినియోగదారులకు రెండు ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయి. సందేశం మోసపూరితమని భావిస్తే పంపిన వ్యక్తిని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయవచ్చు. లేదా సందేశం నిజమైనదేనని నమ్మితే సంభాషణను కొనసాగించవచ్చు. ఈ ఫీచర్‌లో అత్యంత ముఖ్యమైన అంశం ప్రైవసీ. స్కామ్ అలర్ట్ సందేశాలను పూర్తిగా వినియోగదారుడి డివైస్‌లోనే విశ్లేషిస్తుందని సమాచారం. ఇది ప్రస్తుతం ఉన్న వాయిస్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్ మాదిరిగానే పనిచేస్తుంది. దీంతో చాట్‌లు ఎటువంటి బాహ్య సర్వర్లకు వెళ్ల‌వు. వాట్సాప్ సంస్థకు సైతం వినియోగదారుల సంభాషణలపై ప్రాప్యత ఉండదని నివేదిక పేర్కొంది. అలాగే ఈ ఫీచర్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిశ్శబ్దంగా పనిచేస్తుంది. వినియోగదారుడు ఈ ఫీచర్‌ను ఆన్ చేశాడో లేదో ఇతరులకు తెలియదు. స్కామ్ అలర్ట్‌కు అనుబంధంగా మరో పారదర్శకత ఫీచర్‌ను కూడా వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా స్కామ్ అలర్ట్ ఎప్పుడు పనిచేసిందో, ఎలాంటి హెచ్చరికలు ఇచ్చిందో వినియోగదారులు స్థానిక లాగ్‌ల రూపంలో చూడవ‌చ్చు.

పూర్తిగా డివైస్‌లోనే ప‌ని..

ఈ రికార్డులు కూడా పూర్తిగా డివైస్‌లోనే నిల్వ అవుతాయి. వాట్సాప్‌తో అవి షేర్ కావు. ఒక నిర్దిష్ట కాలంలో అనుమానాస్పద కార్యకలాపాలు ఏవీ గుర్తింపు అవ‌క‌పోతే స్కామ్‌కు సంబంధించిన హెచ్చరికలు లేవని రిపోర్ట్ చూపించే అవకాశం ఉంటుంది. స్కామ్ అలర్ట్ ఫీచర్ తప్పనిసరి కాదు. ఇది డిఫాల్ట్‌గా డిసేబుల్డ్‌ స్థితిలోనే ఉండనుంది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించాలనుకునే వారు వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నందున, అధికారిక విడుదల తేదీపై వాట్సాప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement
Advertisement