Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా
Sourav Ganguly | అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee).. ఎంపీగా పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారట. ఇందుకోసం బహరంపూర్ ఎంపీగా (Baharampur MP) కొనసాగుతున్న మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (Yusuf Pathan)ను రాజీనామా చేయాలని దీదీ కోరినట్లు తెలిసింది. ఇందుకోసం ఆమె భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సాయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై దాదా తాజాగా క్లారిటీ ఇచ్చారు.
Sourav Ganguly | అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు పార్లమెంట్‌కు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టాలని దీదీ భావిస్తున్నారట. అందుకోసం ప్రస్తుతం టీఎంసీ తరఫున బహరంపూర్ ఎంపీగా (Baharampur MP) కొనసాగుతున్న మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను రాజీనామా చేయాలని దీదీ కోరినట్లు బెంగాలీ దినపత్రిక నివేదించింది. ఆయన రాజీనామాతో ఏర్పడే ఉప ఎన్నికలో పోటీ చేసి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని మమత భావిస్తున్నట్లు పార్టీ వర్గాలను ఉటంకిస్తూ సదరు దినపత్రిక తెలిపింది. ఇందుకోసం ఆమె భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) సాయం కోరినట్లు సదరు పత్రిక పేర్కొంది.
ఈ నివేదిక బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై గంగూలీ స్పందించారు. ఆ నివేదికలో నిజం లేదని స్పష్టం చేశారు. అవన్నీ తప్పుడు కథనాలే అని కొట్టిపారేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాను ఎప్పుడూ రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇలాంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని సదరు పత్రికను ఆయన కోరారు. యూసఫ్ పఠాన్‌ను రాజీనామా చేసేలా ఒప్పించాలని మమతా బెనర్జీ తనను ఎప్పుడూ కోరలేదని స్పష్టం చేశారు. ఈ విషయమై తాను పఠాన్‌తో కూడా చర్చించలేదన్నారు.
Also Read..
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!
అధికార దుర్వినియోగంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు : ఎంపీ చామల
సంబంధిత వార్తలు

Ritabrata Banerjee | టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. శివసేన తరహాలో పార్టీ చీలిక తప్పదా?
జూన్ 3, 2026

Bengal Signature Scandal | బెంగాల్లో ముదిరిన పొలిటికల్ క్రైసిస్: టీఎంసీలో ‘సంతకాల’ స్కామ్ కలకలం.. ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ
జూన్ 1, 2026

Abhishek Banerjee Attack | హెల్మెట్ ప్రాణం కాపాడింది.. లేదంటే చనిపోయేవాడు: అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
మే 31, 2026
తాజావార్తలు
- ●WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..
- ●WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!
- ●Phone Tapping Case | అధికార దుర్వినియోగంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు : ఎంపీ చామల
- ●RTC Union Elections | జులైలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు..!
- ●Jagga Reddy | సైకిళ్లిచ్చారు.. చిన్నారుల్లో ఉత్సాహం నింపారు
- ●Su-57 Fighter Jet India | శత్రువుల గుండెల్లో వణుకు.. భారత్‌కు రష్యా 'Su-57' ఫైటర్ జెట్ల ఆఫర్, దీని స్పెషాలిటీ ఏంటంటే?

WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..

WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!

Phone Tapping Case | అధికార దుర్వినియోగంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు : ఎంపీ చామల

RTC Union Elections | జులైలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు..!



