త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cockroach Janta Party | జస్ట్ సోషల్ మీడియా డ్రామా కాదు.. రోడ్డెక్కుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’, ఆ ముగ్గురు ఫేమస్ వ్యక్తులకు కీలక బాధ్యతలు!

సరదాగా మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఇప్పుడు ఉద్యమ రూపం దాల్చుతోంది. కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌తో జూన్ 6న నిరసనకు సిద్ధమైన CJP, తమ అధికార ప్రతినిధులను ప్రకటించింది.

J

National | Published On Jun 4, 2026, 9.30 pm IST

Cockroach Janta Party | జస్ట్ సోషల్ మీడియా డ్రామా కాదు.. రోడ్డెక్కుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’, ఆ ముగ్గురు ఫేమస్ వ్యక్తులకు కీలక బాధ్యతలు!
Advertisement
  • ఆన్‌లైన్‌లో పరీక్షల వివాదాలపై సెటైరికల్‌గా మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఇప్పుడు క్షేత్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతోంది
  • ఢిల్లీ వేదికగా తమ పార్టీకి చెందిన ముగ్గురు అధికార ప్రతినిధుల (Spokespersons) పేర్లను CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే అధికారికంగా ప్రకటించారు
  • ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్‌ను చీఫ్ స్పోక్స్‌పర్సన్‌గా నియమించగా.. కంటెంట్ క్రియేటర్ విజేత దహియా, ఐఐటీయన్ అశుతోష్ రాంకాలను ప్రతినిధులుగా ఎంపిక చేశారు
  • విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు CJP ప్లాన్ చేస్తోంది

Cockroach Janta Party | త్రినేత్ర.న్యూస్ : ఆన్‌లైన్‌లో పరీక్షల లీకేజీలు, వివాదాలపై ఒక సెటైరికల్ పోస్ట్‌తో మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదొక సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే అనుకున్న వారికి షాకిస్తూ.. ఏకంగా క్షేత్రస్థాయిలో ఉద్యమించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించిన ముగ్గురు కీలక అధికార ప్రతినిధులను (Spokespersons) CJP పార్టీ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఆ ముగ్గురు ప్రతినిధులు వీరే..

సౌరవ్ దాస్ (Chief Spokesperson): న్యాయ, సామాజిక సంస్కరణలపై దశాబ్ద కాలంగా పోరాడుతున్న స్వతంత్ర ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నవంబర్ 2025లో ఇండియా గేట్ వద్ద జరిగిన యాంటీ-పొల్యూషన్ నిరసనల్లో ఈయనది కీలక పాత్ర. CJPకి ఈయన చీఫ్ స్పోక్స్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.

విజేత దహియా (Spokesperson): పొలిటికల్ రీసెర్చర్, బెస్ట్ సెల్లింగ్ ఆథర్, ఫిల్మ్ మేకర్. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) లాంటి టాప్ క్రియేటర్ల వెనుక కంటెంట్ అండ్ రీసెర్చ్ చేసింది ఈమెనే.

అశుతోష్ రాంకా (Spokesperson): ఐఐటీ కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) పూర్వ విద్యార్థి. లండన్‌లో ప్రతిష్టాత్మక 'మెకిన్సే' సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేసిన ఆయన.. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తో కూడా కలిసి పనిచేశారు. గతేడాది ఇండియాకు తిరిగి వచ్చిన ఆయన జైపూర్‌లో నీట్ (NEET) పేపర్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు.

జూన్ 6న జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన

కేవలం ప్రతినిధుల ప్రకటనతోనే సరిపెట్టకుండా CJP నేరుగా యాక్షన్‌లోకి దిగుతోంది. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ శనివారం (జూన్ 6న) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాకు ప్లాన్ చేస్తోంది. ప్రముఖ విద్యావేత్త, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) కూడా ఈ ఆందోళనకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం విశేషం.

మరోవైపు, తనపై ప్రభుత్వపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకున్నా తాను వెనక్కి తగ్గేది లేదని, త్వరలోనే విదేశాల నుంచి దేశానికి తిరిగి వస్తానని ఫౌండర్ అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. ఒక యూత్ ప్రెషర్ గ్రూప్‌గా (Youth pressure group) పుట్టుకొచ్చిన ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' ఇప్పుడు బలమైన రాజకీయ పార్టీల దృష్టిని సైతం ఆకర్షిస్తోంది. దేశ విద్యావ్యవస్థలో మార్పుల కోసం జరగనున్న ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement