Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ – మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
రజనీకాంత్ కూలీ మూవీలో విలన్ పాత్రలో అదరగొట్టింది రచితా రామ్. తాజాగా కన్నడ బ్యూటీ టాలీవుడ్‌లో ఓ బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. చిరంజీవి, బాబీ మూవీలో రచితా రామ్ ఓ కీలక పాత్రలో కనిపించనుందట.
Entertainment | Published On Jun 6, 2026, 5.33 pm IST
Rachita Ram | రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ మూవీలో లేడీ విలన్‌గా కనిపించింది కన్నడ బ్యూటీ రచితా రామ్. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో తన విలనిజంతో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ప్రస్తుతం కన్నడంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోన్న ఈ బ్యూటీ తెలుగులో ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
పొల్లాచ్చిలో...
చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మలయాళ హీరోయిన్ హనీ రోజ్‌ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ డేట్స్ క్లాష్ కారణంగా ఆమె మెగాస్టార్ మూవీ నుంచి తప్పుకుంది. హనీ రోజ్ స్థానంలో కన్నడ బ్యూటీ రచితా రామ్‌ను మేకర్స్ ఫైనల్ చేసేశారట.
కూలీ తరహాలోనే డిఫరెంట్ షేడ్స్‌తో చిరంజీవి సినిమాలో రచితా రామ్ రోల్ సాగుతుందట. త్వరలోనే ఈ తెలుగు మూవీ సెట్స్‌లో ఈ కన్నడ నాయిక ఆడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది.
అల్లుడి సినిమాతో ఎంట్రీ...
2022లో వచ్చిన సూపర్ మచ్చి సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రచితా రామ్. ఈ సినిమాలో చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా నటించాడు. సూపర్ మచ్చి డిజాస్టర్ కావడంతో రచితా రామ్‌కు తెలుగులో మళ్లీ ఆఫర్లు రాలేదు. నాలుగేళ్ల తర్వాత చిరంజీవి సినిమాతో టాలీవుడ్‌లోకి ఈ కన్నడ హీరోయిన్ రీఎంట్రీ ఇవ్వబోతుంది.
మోహన్‌లాల్...
చిరంజీవి బాబీ మూవీలో అనస్వర రాజన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్ కూడా ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి హీరోగా నటిస్తోన్న 158వ మూవీ ఇది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. వాల్తేర్ వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ – తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
అక్టోబర్ 3, 2026

Chiranjeevi | మీ సాహసం.. ప్రతి భారతీయుడికీ గర్వకారణం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై మెగాస్టార్ ప్రశంసలు
అక్టోబర్ 3, 2026

Rachita Ram | హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని – పబ్లిక్‌గా ఇదేం పని అంటూ నెటిజన్ల ఫైర్
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క
- ●Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్
- ●Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య
- ●Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
- ●Bus Accident | అనంతగిరి వద్ద లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి

Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క

Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్

Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు



