త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్ కోరిక నెర‌వేర్చిన రాహుల్ గాంధీ

Rahul Gandhi | లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ).. టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్( Mahesh Goud ) కోరిక‌ను నెర‌వేర్చారు. శ‌నివారం ఉద‌యం టీ పీసీసీ చీఫ్‌ ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి చేయ‌గానే.. మ‌ధ్యాహ్నం నాటికి రాహుల్ అమ‌లు చేశారు.

S

Telangana | Published On Nov 14, 2026, 4.19 pm IST

Rahul Gandhi | టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్ కోరిక నెర‌వేర్చిన రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ).. టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్( Mahesh Goud ) కోరిక‌ను నెర‌వేర్చారు. శ‌నివారం ఉద‌యం టీ పీసీసీ చీఫ్‌ ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి చేయ‌గానే.. మ‌ధ్యాహ్నం నాటికి రాహుల్ అమ‌లు చేశారు.

ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి ఏంటంటే..?

శ‌శ‌నివారం ఉద‌యం సైబ‌రాబాద్ ప‌రిధిలో గిగ్ వ‌ర్క‌ర్ల ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ, మ‌హేశ్ కుమార్ గౌడ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ కొన‌సాగింది. రాజ‌కీయాల‌తో పాటు తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, సోనియా ఆత్మ‌క‌థ పుస్త‌కంపై ఇరువురు చ‌ర్చించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాహుల్‌కు మ‌హేశ్ గౌడ్ సూచ‌న చేశారు. అదేంటంటే.. కుర్తా పైజామా ధ‌రించాల‌ని రాహుల్‌కు ఆయ‌న ప్ర‌త్యేక రెక్వెస్ట్ చేశారు. దీంతో సరే అంటూ నవ్వుతూ మహేశ్‌కు రాహుల్ చాక్లెట్ ఇచ్చారు. ఇంకేముంది.. భార‌త్ స‌మ్మిట్‌లో పాల్గొనే స‌మ‌యానికి రాహుల్ గాంధీ కుర్తా పైజామాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఈ వేదిక‌పై కూడా రాహుల్ వెనుకాలే మ‌హేశ్ గౌడ్ వ‌చ్చారు. రాహుల్ డ్రెస్‌ను చూసి మ‌హేశ్ మురిసిపోయారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో మ‌హేశ్ కోరిక రాహుల్ నెర‌వేర్చిండు అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Advertisement