Giri Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత – హీరోగా తొలి ఛాన్స్ – విలన్‌గా ఫేమస్
టాలీవుడ్ సీనియర్ సినీ నటుడు గిరిబాబు అనారోగ్య సమస్యలతో శనివారం కన్నుమూశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆరు వందలకుపైగా సినిమాలు చేశారు గిరిబాబు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ప్రతిభను చాటుకున్నారు.
Entertainment | Published On Nov 14, 2026, 4.18 pm IST
Giri Babu |టాలీవుడ్ సీనియర్ సినీ నటుడు గిరిబాబు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆరు వందలకుపైగా సినిమాలు చేశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనదైన శైలి నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా గిరిబాబు రాణించారు.
హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సింది...
1943లో ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించారు గిరిబాబు. ఆయన అసలు పేరు శేషారావు. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి రాకముందు చాలా ఏళ్ల పాటు నాటకాలు వేశారు. రంగస్థలం ద్వారానే ఆయన సినిమాల్లో అవకాశం వచ్చింది. హీరోగా గిరిబాబు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కావాల్సింది. తొలుత ధైర్యే సాహసే లక్ష్మి అనే జానపద సినిమాను అంగీకరించారు గిరిబాబు. కానీ షూటింగ్ మొదలుకాకముందే ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత అవకాశాల కోసం తన పేరును గిరిబాబుకుగా మార్చుకున్నారు.
నటుడిగా, నిర్మాతగా...
1973లో రిలీజైన జగమే మాయ మూవీతో విలన్‌గా గిరిబాబు సినీ ప్రయాణం ప్రారంభమైంది. తొలి సినిమా విజయం సాధించడంతో నటుడిగా గిరిబాబు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకే సారి ఏడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. విలన్‌గానే కాకుండా వధూవరులు, సింహగర్జన, జ్యోతిలక్ష్మి అనే సినిమాల్లో హీరోగా నటించాడు. ముగ్గురు మొనగాళ్లు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పచ్చని సంసారం, చిత్ర భలారే విచిత్రం, నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలితో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. చివరగా అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో నటించారు.
నిర్మాతగా
నటుడిగా సినీ ప్రయాణం మొదలైన నాలుగేళ్ల తర్వాత ప్రొడ్యూసర్‌గా మారారు గిరిబాబు. జయభేరి ఆర్ట్స్ పిక్చర్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా దేవతలారా దీవించండి అనే సినిమాను నిర్మించారు. తొలి సినిమానే పెద్ద విజయాన్ని సాధించడంతో నిర్మాతగా గిరిబాబు పేరు మారుమోగింది. నిర్మాతగా రెండో సినిమా సింహగర్జన...ఎన్టీఆర్ సింహబలుడుకు పోటీగా రిలీజైంది. ఆ తర్వాత మెరుపుదాడి, రణరంగంతో పాటు మరికొన్ని సినిమాలతో ప్రొడ్యూసర్‌గా మంచి విజయాలను అందుకున్నారు.
కొడుకు హీరోగా...
తనయుడు బోసుబాబు హీరోగా పరిచయం చేస్తూ కౌబాయ్ కథతో ఇంద్రజీత్ అనే సినిమాను తెరకెక్కించారు గిరిబాబు. ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. నిర్మాతగా ఈ సినిమా గిరిబాబుకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ పరాజయం తర్వాత నిర్మాతగా మళ్లీ సినిమా చేయలేదు.
టాప్ కమెడియన్...
గిరిబాబు తనయుడు రఘుబాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా కొనసాగుతోన్నారు. మరో తనయుడు బోసుబాబు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. సక్సెస్ కాలేకపోవడంతో సినిమాలకు దూరమయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల అవిశ్రాంత పోరాటానికి లభించిన విజయం ఇది
- ●Cyclone | మరో తుపాను ముప్పు..! హెచ్చరించిన వాతావరణశాఖ
- ●Ntr | ఊహించని కాంబో సెట్ - అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ
- ●FPI Investments | విదేశీ పెట్టుబడిదారుల యూ టర్న్.. ఈ నెలలో రూ.84వేల కోట్లు రాక.. కారణాలేమిటి..?
- ●Cinematica Expo 2026 | హైదరాబాద్ టీ-హబ్‌లో 'సినిమాటికా ఎక్స్పో 2026'.. సినిమా, AI, గేమింగ్ క్రియేటర్లకు గోల్డెన్ ఛాన్స్
- ●ISRO Apprentice | సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో 400 అప్రెంటిస్‌లు

Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల అవిశ్రాంత పోరాటానికి లభించిన విజయం ఇది

Cyclone | మరో తుపాను ముప్పు..! హెచ్చరించిన వాతావరణశాఖ

Ntr | ఊహించని కాంబో సెట్ - అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ

FPI Investments | విదేశీ పెట్టుబడిదారుల యూ టర్న్.. ఈ నెలలో రూ.84వేల కోట్లు రాక.. కారణాలేమిటి..?





