త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naroda Murder Case | “కూర రుచిగా లేదు” అన్నందుకు ఇంత దారుణమా? కిచెన్ నైఫ్‌తో పొడిచి భర్త ప్రాణం తీసిన భార్య!

అహ్మదాబాద్‌లో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. రాత్రి భోజనంలో కూర రుచిగా లేదని భర్త అనడంతో ఆగ్రహించిన భార్య, వంటగది కత్తితో పొడిచి మాజీ ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది.

J

Crime | Published On Nov 8, 2026, 8.52 pm IST

Naroda Murder Case | “కూర రుచిగా లేదు” అన్నందుకు ఇంత దారుణమా? కిచెన్ నైఫ్‌తో పొడిచి భర్త ప్రాణం తీసిన భార్య!

సంక్షిప్త సారాంశం

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరోడా ప్రాంతంలో నవంబర్ 6న రాత్రి భోజనం విషయంలో జరిగిన గొడవలో భార్య చేతిలో మాజీ ఆర్మీ ఉద్యోగి దిలీప్ ఖరాడి హత్యకు గురయ్యారు. కూర రుచిగా లేదని భర్త అనడం, ఇంటి బాధ్యతల విషయంలో మాటామాటా పెరగడంతో భార్య నిర్మల కిచెన్ నైఫ్‌తో ఆయన ఛాతీపై బలంగా పొడిచింది. గుండె పైభాగంలో తీవ్ర గాయం కావడంతో నిర్మల స్వయంగా భర్తను ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరోడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితురాలు నిర్మలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Naroda Murder Case | త్రినేత్ర న్యూస్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నరోడా స్మార్ట్ సిటీ ఏరియాలో నవంబర్ 6 రాత్రి భోజనం దగ్గర జరిగిన చిన్నపాటి గొడవలో.. మాజీ ఆర్మీ ఉద్యోగి దిలీప్ ఖరాడి (39)ని ఆయన భార్య నిర్మలా ఖరాడి (34) వంటగది కత్తితో పొడిచి హత్య చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన దిలీప్, ప్రస్తుతం జీఎండీసీ (GMDC)లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య నిర్మల, ఇద్దరు పిల్లలతో కలిసి నరోడాలో నివసిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఫ్యామిలీ విషయాలు, ఇంటి బాధ్యతలపై తరచూ గొడవలు జరుగుతున్నాయి.

గురువారం రాత్రి దిలీప్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాక, రాత్రి 10 గంటల తర్వాత నిర్మల ఆయనకు భోజనం వడ్డించింది. అయితే కూర రుచిగా లేదని దిలీప్ చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భోజనం దగ్గర మొదలైన ఈ వివాదం కాస్తా ఇంటి బాధ్యతల వైపు మళ్లి తీవ్రరూపం దాల్చింది.

ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన నిర్మల.. వంటగదిలో ఉన్న కిచెన్ నైఫ్ తీసుకుని భర్త ఎడమ వైపు ఛాతీపై బలంగా పొడిచింది. కత్తి నేరుగా గుండె పైభాగంలో దిగడంతో దిలీప్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు.

వెంటనే కంగారుపడిన నిర్మల స్వయంగా భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఆస్పత్రికి తీసుకువచ్చేలోపే దిలీప్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ ఘటనపై సీనియర్ పోలీస్ ఆఫీసర్ వి.ఎన్. యాదవ్ మాట్లాడుతూ.. "దిలీప్, నిర్మల మధ్య గత కొంతకాలంగా ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య జరిగిన వివాదంలో నిర్మల కత్తితో దాడి చేయగా, గుండె పైభాగంలో తీవ్ర గాయమై దిలీప్ మరణించారు" అని తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నరోడా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, నిందితురాలు నిర్మలను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement