త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 14 ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ..!

Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నవంబర్‌ నెలలో వివిధ ప్రాంతాలకు న‌డ‌వ‌నున్న 14 ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఉన్నాయ‌ని చెప్పింది. సికింద్రాబాద్‌, చర్లపల్లి, హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం రోడ్‌, విశాఖపట్నం, నరసాపురం, కాకినాడ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

P

Telangana | Published On Nov 14, 2026, 4.35 pm IST

Special Trains | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 14 ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ..!
Advertisement

Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నవంబర్‌ నెలలో వివిధ ప్రాంతాలకు న‌డ‌వ‌నున్న 14 ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఉన్నాయ‌ని చెప్పింది. సికింద్రాబాద్‌, చర్లపల్లి, హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం రోడ్‌, విశాఖపట్నం, నరసాపురం, కాకినాడ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఈ మేర‌కు స్టేట‌స్‌ను రిలీజ్ చేసింది. శ్రీకాకుళం రోడ్‌కు వెళ్లే సికింద్రాబాద్‌–శ్రీకాకుళం రోడ్‌ (07425) ప్రత్యేక రైలులో నవంబర్‌ 15న 259, 22న బ‌య‌లుదేరే రైలులో 315, 29న వెళ్లే ట్రైన్‌లో 431 బెర్తులు ఖాళీగా ఉన్నాయ‌ని తెలిపింది. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్‌ (07037) రైలులో నవంబర్‌ 17న 319, 24న 25 బెర్తులు అందుబాటులో ఉన్నాయి.

ఇక సికింద్రాబాద్‌–విశాఖపట్నం (08518) ప్రత్యేక రైలులో నవంబర్‌ 16న 563 బెర్తులు ఖాళీగా ఉన్నాయని దక్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. ఇక నరసాపురం, కాకినాడ వెళ్లే ప్రయాణికులకు సైతం బెర్తులు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి–నరసాపురం (07063) రైలులో నవంబర్‌ 16న 354, 23న 278, 30న 330 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ (07039) ప్రత్యేక రైలులో నవంబర్‌ 18న 382, 25న 292 బెర్తులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తమిళనాడు, కేరళ వైపు వెళ్లే ప్రత్యేక రైళ్లలోనూ భారీగా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. చర్లపల్లి–తిరువణ్ణామలై (07003) రైలులో నవంబర్‌ 17న 139 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి–సెంగొట్టై (07191) రైలులో నవంబర్‌ 20న 103, 27న 342 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నాందేడ్‌–కొల్లం (07189) రైలులో నవంబర్‌ 15న 729 బెర్తులు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపింది. అలాగే, చర్లపల్లి–కొల్లం (07180) రైలులో నవంబర్‌ 27న 443 బెర్తులు ఖాళీగా ఉండగా.. మరో చర్లపల్లి–కొల్లం (07195) ప్రత్యేక రైలులో నవంబర్‌ 22న 886, 29న 860 బెర్తులు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే వివ‌రించింది.

కర్ణాటక వెళ్లే ప్రయాణికుల కోసం హైదరాబాద్‌–మంగళూరు (07097) ప్రత్యేక రైలులో నవంబర్‌ 18న 38, 25న 45 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతి వైపు వెళ్లే రైళ్లలోనూ రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి. జల్నా–తిరుపతి (07814) రైలులో నవంబర్‌ 19న 187, 26న 217 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. హజ్రత్‌ నాందేడ్‌–తిరుచానూరు (07603) రైలులో నవంబర్‌ 17న 389, 24న 594 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్‌–తిరుపతి (07422) ప్రత్యేక రైలులో నవంబర్‌ 16న 472 బెర్తులు ఖాళీగా ఉన్నట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే వివ‌రించింది. అయితే, ప్రత్యేక రైళ్లలో బెర్తుల ఖాళీల సంఖ్య ప్రయాణికుల బుకింగ్‌లను బట్టి ఎప్పటికప్పుడు మారుతుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవాలని పీఆర్‌వో శ్రీధర్ సూచించారు.

 

Advertisement
Advertisement