Mumbai Police | ముంబై పోలీసు శాఖలో భారీ స్కామ్.. ఘోస్ట్ ఉద్యోగులకు రూ.6.41 కోట్ల జీతాలు
Mumbai Police | ముంబై పోలీసు శాఖ (Mumbai Police Department)లో బయటపడిన ఓ భారీ శాలరీ స్కామ్ (financial fraud) అధికారులను నివ్వెరపోయేలా చేస్తోంది. పోలీసు శాఖతో ఎలాంటి సంబంధం లేని 10 మంది ఘోస్ట్ ఉద్యోగులకు (Ghost Employees) ఏకంగా రూ.6.41 కోట్ల జీతాలు చెల్లించినట్లు తేలింది.
Mumbai Police | త్రినేత్ర.న్యూస్ : ముంబై పోలీసు శాఖ (Mumbai Police Department)లో బయటపడిన ఓ భారీ శాలరీ స్కామ్ (financial fraud) అధికారులను నివ్వెరపోయేలా చేస్తోంది. పోలీసు శాఖతో ఎలాంటి సంబంధం లేని 10 మంది ఘోస్ట్ ఉద్యోగులకు (Ghost Employees) ఏకంగా రూ.6.41 కోట్ల జీతాలు చెల్లించినట్లు తేలింది. పాత 'సేవార్థ్' పేరోల్ సిస్టమ్ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్‌కు ఉద్యోగుల డేటాను బదిలీ చేస్తున్న సమయంలో ఈ స్కామ్ తాలూకూ వివరాలు బయటపడ్డాయి.
పోలీసు శాఖతో ఎలాంటి సంబంధం లేని 10 మంది వ్యక్తులను ఉద్యోగులుగా చూపించి వారి పేరిట జీతాలు కాజేశారు. 2019 డిసెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు, 2020 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య మాత్రమే ఘోస్ట్ ఎంప్లాయీస్ బ్యాంకు ఖాతాలకు జీతాలు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మంత్రి స్థాయి అధికారులు, క్లర్కులు కలిసికట్టుగా నకిలీ హాజరు రిజిస్టర్లు, దొంగ ఉద్యోగుల రికార్డులను సృష్టించినట్లు తేలింది. వారు పది మంది వ్యక్తుల పేర్లను అనధికారికంగా జీతాల జాబితాలో చేర్చినట్లు అధికారుల ఆడిట్‌లో వెల్లడైంది.
దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. 2019-20 మధ్య కాలంలో అడ్మినిస్టేటివ్‌లో విధుల్లో ఉన్న ఐదుగురు అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ భారీ స్కామ్‌తో ప్రమేయం ఉన్న అధికారులపై వేటు వేశారు. ఈ భారీ స్కామ్ వ్యవహారం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది.
Also Read..
వరంగల్‌ను రెండో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
కాల్ క్వాలిటీపై ఇక ఫిర్యాదు చేయడం చాలా సులభం.. ట్రాయ్ కొత్త మైకాల్ యాప్ విడుదల..
ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
తాజావార్తలు
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?






