Aishwarya Rajesh | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఓ సుకుమారి థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆగస్ట్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ విడుదల అవుతోంది. ఓ సుకుమారి మూవీకి భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Aug 4, 2026, 4.34 pm IST
Aishwarya Rajesh | తిరువీర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన తెలుగు మూవీ ఓ సుకుమారి థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు భరత్ దర్శన్ దర్శకత్వం వహించాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో ఆనంద్, ఝాన్సీ, మురళీధర్ గౌడ్, అంజిమామ కీలక పాత్రల్లో కనిపించారు.
అమెజాన్ ప్రైమ్‌లో...
ఓ సుకుమారి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఆగస్ట్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్లలో ఓ సుకుమారికి మిక్స్‌డ్ టాక్ రావడంతో ఇరవై రోజులు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కామెడీ టైమింగ్...
హీరోయిన్‌ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టడం అనే వెరైటీ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ భరత్ దర్శన్ ఈ సినిమాను తెరకెక్కించారు. కథ కొత్తగా ఉన్న ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తడబడటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ మాత్రం బాగున్నాయంటూ కామెంట్లు వినిపించాయి.
దామిని సమస్య...
దామిని పొరపాటుగా ఎవరినన్నా తగిలినా...ఆమెను ఎవరన్నా ముట్టుకున్నా కరెంట్ షాక్‌తో విలవిలలాడిపోతుంటారు. ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలన్నీ చెడిపోతుంటాయి. ఆమెకున్న సమస్యను దాచిపెట్టి నరాల యాదగిరితో ఊరివాళ్లందరూ దామిని పెళ్లిచేస్తారు. శోభనం రోజే దామినికి ఉన్న సమస్య గురించి యాదగిరి తెలుస్తుంది. కరెంట్ షాక్ సమస్య కారణంగా ప్రాణంగా ప్రేమించిన దామినికి యాదగిరి ఎలా దూరమయ్యాడు? యాదగిరి కుటుంబంలోని విభేదాలను దామిని ఏ విధంగా పరిష్కరించింది? భార్య మంచితనాన్ని, ప్రేమను యాదగిరి అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
వెబ్ సిరీస్...
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ తర్వాత తెలుగులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించిన మూవీ ఇది. ఓ వైపు సినిమాలు చేస్తూనే వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది. ఇటీవలే ఇసకపట్నం అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం మూడు లాంతర్లు పేరుతో తెలుగులో మెసేజ్ ఓరియెంటెడ్ వెబ్‌సిరీస్ చేయబోతుంది. తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
- ●BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి






