Konda Surekha | వరంగల్‌ను రెండో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
Konda Surekha | తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌గా వరంగల్‌ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
- సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు కార్యాచరణ
- సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై ప్రత్యేక దృష్టి
- వైద్య సేవల బలోపేతంపై మంత్రి కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ సమీక్ష
Konda Surekha | తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌గా వరంగల్‌ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, ఇతర వైద్య సంస్థల అభివృద్ధిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. వైద్య సేవల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకాలు, ఆధునిక వైద్య పరికరాల సమీకరణపై సమావేశంలో చర్చించారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి
వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల పురోగతిపై మంత్రులు ఆరా తీశారు. ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తయిన నేపథ్యంలో అత్యవసర విభాగం, డయాలసిస్ సేవలు, క్యాథ్‌ల్యాబ్, ఆక్సిజన్ సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది నియామకాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఎంజీఎం ఆస్పత్రిపై ఉన్న రోగుల ఒత్తిడి తగ్గుతుందని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రులు పేర్కొన్నారు. ఆస్పత్రి అంతర్గత రహదారులు, ల్యాండ్‌స్కేపింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఎంజీఎం ఆస్పత్రిలో పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మంత్రి కొండా సురేఖ కోరారు. ఉద్యోగుల ప్రమోషన్ల అంశాన్ని కూడా పరిష్కరించాలని సూచించారు. ఎంజీఎం పాత భవనాల మరమ్మతులు, విద్యుత్, ప్లంబింగ్, భద్రతా వ్యవస్థల బలోపేతంతో పాటు కొత్త వైద్య పరికరాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఎంజీఎం, సీకేఎం ఆస్పత్రుల అభివృద్ధికి సమగ్ర చర్యలు చేపట్టాలని కోరారు. సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల పెంపు, పేరుకుపోయిన స్క్రాప్ తొలగింపు, అందుబాటులోకి వచ్చే స్థలాన్ని ఆస్పత్రి అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఉర్సు మెటర్నిటీ ఆస్పత్రిలోనూ సౌకర్యాలు పెంచాలని పేర్కొన్నారు.
కాకతీయ మెడికల్ కాలేజీకి మరిన్ని సదుపాయాలు
కాకతీయ మెడికల్ కాలేజీలో పెరిగిన ఎంబీబీఎస్, పీజీ సీట్లకు అనుగుణంగా విద్యార్థుల హాస్టళ్లు, అకాడమిక్ భవనాలు, ఆడిటోరియం అభివృద్ధి చేయాలని మంత్రి కొండా సురేఖ కోరారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీ, ఆధునిక నేత్ర వైద్య పరికరాల సమకూర్పు, శిక్షణా సదుపాయాల ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలని తెలిపారు. నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేదిక్ టీచింగ్ ఆస్పత్రి, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో మౌలిక వసతులు, నిధులు, సిబ్బంది కొరత అంశాలను సమావేశంలో ప్రస్తావించారు.
గ్రీన్ హాస్పిటల్స్ లక్ష్యంగా చర్యలు
ప్రభుత్వ ఆస్పత్రులను ‘గ్రీన్ హాస్పిటల్స్’గా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆస్పత్రుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అమలు చేయాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్రంలో రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య సేవల పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని మంత్రి కొండా సురేఖ.. మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ప్రతి ప్రభుత్వ వైద్య సంస్థ ప్రజలకు నమ్మకమైన ఆరోగ్య కేంద్రంగా మారాలని ఆమె సూచించారు. వైద్య సేవల నాణ్యత, మౌలిక వసతులు, సిబ్బంది, ఆధునిక పరికరాల విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి సురేఖ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MLA Sudheer Reddy | 4 మీటర్ల లాంగ్ జంప్ ఎత్తేయండి
- ●TRAI | కాల్ క్వాలిటీపై ఇక ఫిర్యాదు చేయడం చాలా సులభం.. ట్రాయ్ కొత్త మైకాల్ యాప్ విడుదల..
- ●Aishwarya Rajesh | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
- ●AMCA Fighter Jet | స్వదేశీ ఫైటర్ జెట్లకు మన సొంత ఇంజిన్.. సఫ్రాన్-GTRE డీల్‌తో మారనున్న భారత వాయుసేన తలరాత
- ●Harish Rao | హరీశ్‌రావుపై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు
- ●H-FAST | బట్టలకు వేసే రంగులతో మసాలాల తయారీ

MLA Sudheer Reddy | 4 మీటర్ల లాంగ్ జంప్ ఎత్తేయండి

TRAI | కాల్ క్వాలిటీపై ఇక ఫిర్యాదు చేయడం చాలా సులభం.. ట్రాయ్ కొత్త మైకాల్ యాప్ విడుదల..

Aishwarya Rajesh | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా

AMCA Fighter Jet | స్వదేశీ ఫైటర్ జెట్లకు మన సొంత ఇంజిన్.. సఫ్రాన్-GTRE డీల్‌తో మారనున్న భారత వాయుసేన తలరాత






