TRAI | కాల్ క్వాలిటీపై ఇక ఫిర్యాదు చేయడం చాలా సులభం.. ట్రాయ్ కొత్త మైకాల్ యాప్ విడుదల..
TRAI | దేశంలోని టెలికాం వినియోగదారుల కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో ట్రాయ్ మైకాల్ యాప్‌ను కొత్త వెర్షన్‌లో విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ వాయిస్ కాల్ అనుభవాన్ని రియల్‌టైమ్‌లో రేటింగ్ ఇవ్వడంతోపాటు, కాల్ నాణ్యతకు సంబంధించిన సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
Technology | Published On Aug 4, 2026, 4.40 pm IST
TRAI | దేశంలోని టెలికాం వినియోగదారుల కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో ట్రాయ్ మైకాల్ యాప్‌ను కొత్త వెర్షన్‌లో విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ వాయిస్ కాల్ అనుభవాన్ని రియల్‌టైమ్‌లో రేటింగ్ ఇవ్వడంతోపాటు, కాల్ నాణ్యతకు సంబంధించిన సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌తోపాటు సంబంధిత నెట్‌వర్క్ వివరాలను కూడా సేకరిస్తారు. ఈ సమాచారం వ్యక్తిగత గుర్తింపులు లేకుండా (అనానిమైజ్డ్ రూపంలో) సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు (టీఎస్‌పీలు), ట్రాయ్‌కు అందుతుంది. దీంతో నెట్‌వర్క్‌లో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని త్వరగా పరిష్కరించేందుకు టెలికాం సంస్థలకు అవకాశం లభిస్తుంది.
వినియోగదారుల ప్రత్యక్ష ఫీడ్‌బ్యాక్‌తో..
ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లో 100 కోట్లకు పైగా టెలికాం వినియోగదారులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ వాయిస్ కాలింగ్ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఒక నెట్‌వర్క్ నాణ్యతను వినియోగదారుడు మొదటగా గుర్తించే అంశం కూడా కాల్ అనుభవమే. ఇప్పటివరకు టెలికాం సంస్థలు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (క్యూఓఎస్) సాంకేతిక ప్రమాణాల ఆధారంగా నెట్‌వర్క్ పనితీరును అంచనా వేస్తుండగా, ఇప్పుడు ట్రాయ్ మైకాల్ యాప్ ద్వారా వినియోగదారుల ప్రత్యక్ష ఫీడ్‌బ్యాక్‌ను కూడా కలిపి క్వాలిటీ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ (క్యూఓఈ)ని మరింత సమగ్రంగా అంచనా వేయవచ్చని ట్రాయ్ తెలిపింది.
1 నుంచి 5 స్టార్‌ల వరకు రేటింగ్..
కొత్త ట్రాయ్ మైకాల్ యాప్‌లో వాయిస్ కాల్‌కు 1 నుంచి 5 స్టార్‌ల వరకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కాల్ డ్రాప్, కాల్ సమయంలో ఎకో వినిపించడం, ఆడియో ఆలస్యం, క్రాస్ కనెక్షన్, వాయిస్ బ్రేక్ అవడం, ఒకరికి మరొకరి గొంతు వినిపించకపోవడం, కాల్ కనెక్ట్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం వంటి సమస్యలను కూడా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులు నేరుగా సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు చేరి, అవసరమైన చర్యలు తీసుకునేలా వ్యవస్థ రూపొందించారు. అలాగే ప్రతి కాల్ అనంతరం ఆటోమేటిక్‌గా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని యాప్ వినియోగదారులను కోరుతుంది. గతంలో ఇచ్చిన రేటింగ్‌లు, ఫీడ్‌బ్యాక్ చరిత్రను ఇంటరాక్టివ్ మ్యాప్‌లో చూడొచ్చు. అలాగే మొబైల్ సిగ్నల్ బలాన్ని పరీక్షించే కవరేజ్ టెస్ట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ట్రాయ్ మైకాల్ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్లాన్లు..
సెప్టెంబర్ 22, 2026

TRAI | 1601 నంబర్ సిరీస్‌ను ప్రవేశపెట్టిన ట్రాయ్.. ఈ నంబర్లను ఏయే కంపెనీలకు ఇచ్చారంటే..
ఆగస్టు 11, 2026

TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..
జులై 29, 2026
తాజావార్తలు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!
- ●Gadwal Vijaya Lakshmi | వారంలోపు నియామక పత్రాలు ఇవ్వండి: గద్వాల్ విజయలక్ష్మి
- ●CM Revanth Reddy | నీళ్లు నిలిచినా.. వాహనాలు ఆగినా.. మీ ఉద్యోగాలుండవ్..
- ●Yadadri | యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత.. ఎందుకంటే.?
- ●Stephen Raveendra | అక్టోబర్ నుంచే ధాన్యం కొనుగోళ్లు.. 65 లక్షల టన్నులు లక్ష్యం: స్టీఫెన్ రవీంద్ర

Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?

Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Gadwal Vijaya Lakshmi | వారంలోపు నియామక పత్రాలు ఇవ్వండి: గద్వాల్ విజయలక్ష్మి

CM Revanth Reddy | నీళ్లు నిలిచినా.. వాహనాలు ఆగినా.. మీ ఉద్యోగాలుండవ్..



