Supreme Court | అయోధ్య విరాళాల చోరీపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు
Supreme Court | అయోధ్య విరాళాల చోరీపై నివేదిక ఇవ్వాలని సిట్ అధికారులను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra), ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Supreme Court | అయోధ్య విరాళాల చోరీపై నివేదిక ఇవ్వాలని సిట్ అధికారులను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. రామాలయంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra), ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఆదేశించింది. అదేవిధంగా సిట్ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను కూడా కోరింది. యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా SIT స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్‌లో ధర్మాసనం ముందు ఉంచుతామని ఆయన కోర్టుకు తెలియజేశారు. దీనిపై పిటిషనర్లు తమకు కూడా ఆ కాపీ కావాలని కోరగా.. సొలిసిటర్ జనరల్ అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అప్పుడు సీజేఐ స్పందిస్తూ.. 'మీకు చట్టం తెలుసు కదా.. ఎలాగైనా సరే చివరికి వారు ఆ నివేదికను చూస్తారు' అని వ్యాఖ్యానించారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఈ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారించనున్నట్లు కోర్టు తెలిపింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలంటూ కేంద్రంతోపాటూ యూపీ సర్కార్‌ను ధర్మాసనం ఆదేశించింది.
కాగా, అయోధ్య రామాలయంలో కానుకల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై యోగి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ సందర్భంగా ఆలయ లెక్కింపు గదిలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇక ఈ కేసులో కానుకల లెక్కింపు విభాగంలో పనిచేస్తున్న ఎనిమిది మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ (Champat Rai) నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే రాజీనామా చేశారు.
Also Read..
గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే సాధించిన విజయ్ ప్రభుత్వం
సేమ్ సీన్ రిపీట్ - మలయాళ బ్యూటీ ప్లేస్‌లో భాగ్యశ్రీ బోర్సే - క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా!
కొత్తపేట టిమ్స్‌కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.. తల్లి శంకరమ్మ విజ్ఞప్తి
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి
- ●Telangana SIR Portal | తెలంగాణ ఓటర్లకు బిగ్ రిలీఫ్: SIR పోర్టల్‌లో కొత్త అప్డేట్.. ఆ 11 డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవచ్చు!
- ●Rashmika Mandanna | వరలక్ష్మి వ్రతం చేసిన రష్మిక మందన్న - ఇన్‌స్టా పోస్ట్‌తో గుడ్‌న్యూస్

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు

CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..

NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి






