Wedding Fight | విందులో మటన్ కోసం కుర్చీలు, కర్రలు విరిగాయ్..
Wedding Fight | త్రినేత్ర.న్యూస్: పెండ్లి విందులో మటన్ బదులు చికెన్ పెట్టారని కత్తులు, కర్రలతో (Wedding Fight) కొట్టుకున్నారు. దీంతో వివాహ వేడుక కాస్తా రణరంగంగా మారింది. 12 మంది దవాఖాన పాలయ్యారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని (Bihar) సహర్సా జిల్లా సిమ్రి బక్తియార్‌పూర్‌లో చోటుచేసుకున్నది. పట్టణానికి చెందిన మహ్మద్ అన్వర్ కుమారుడు మహ్మద్ అబ్దుల్లాకు, అదే ప్రాంతంలో ఉండే మహ్మద్ జావేద్ కుమార్తెకు గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘనంగా వివాహం (Nikah) జరిగింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ వేదిక వద్ద.. విందు ప్రారంభమైన తర్వాత రచ్చరచ్చ (Wedding Menu) అయింది.

విందులో మటన్ (Mutton) బదులు చికెన్ (Chicken) వంటకాలు వడ్డించడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో ఒప్పందం ప్రకారం మటన్ వడ్డించాలని, ఇచ్చిన మాట తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో చూస్తుండగానే పరిస్థితి ఘర్షణకు దారితీసింది. వధూవరుల తరపు బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అంతటితో ఆగకుండా, కొందరు పెద్ద పెద్ద కర్రలతో (Sticks) అతిథులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. మరికొందరు కత్తులు (Swords) తిప్పుతూ పెండ్లికి వచ్చినవారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పరిస్థితి చేయిదాటిపోతుండంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. భారీగా సిబ్బందిని మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన 12 మందిని దవాఖానకు తరలించారు. వీడియో ఆధారంగా కర్రలు, కత్తులతో వీరంగం సృష్టించినవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, కలకాలం గుర్తుండిపోవాల్సిన వివాహ వేడుక ఇలా మటన్ కూర కోసం రణరంగంగా మారడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
CHICKEN MUTTON FIGHT IN BIHAR
Promised Mutton, Served Chicken: Brawl At Bihar Wedding Leaves 12 InjuredVideos of the fight have gone viral on social media. In one clip, men are seen hitting guests with sticks and even waving swords. pic.twitter.com/jrGzIeN3VG— Shakeel Yasar Ullah (@yasarullah) July 11, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ






