Prashanth Kishore | ఉప ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోటలో గెలిచేనా..?
Prashanth Kishore | జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్( Prashanth Kishore ) ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్( Bankipur ) అసెంబ్లీ నియోజకవర్గం(బీహార్) నుంచి ప్రశాంత్ కిశోర్ బరిలో దిగనున్నారు.
Prashanth Kishore | త్రినేత్ర.న్యూస్ : జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్( Prashanth Kishore ) ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్( Bankipur ) అసెంబ్లీ నియోజకవర్గం(బీహార్) నుంచి ప్రశాంత్ కిశోర్ బరిలో దిగనున్నారు. ఈ మేరకు జన్ సూరజ్ పార్టీ( Jan Suraaj Party ) బీహార్ అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.
ఆలోచించి ఓటేయండి..
ఈ ఉప ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని బంకీపూర్ ప్రజలను ప్రశాంత్ కిశోర్ కోరారు. బంకీపూర్ ప్రజల్లో చాలా మంది ధనవంతులు, విద్యావంతులు ఉన్నారు. కాబట్టి ఓటు ఎవరికి వేస్తే మేలు జరుగుతుందో ఆలోచించి ఓటేయాలి. నేను సరైన అభ్యర్థినని ప్రజలు భావిస్తే ఈ ఉప ఎన్నికల్లో నాకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
నితిన్ నబీన్ రాజీనామాతో..
బంకీపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున గెలుపొందిన నితిన్ నబీన్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నితిన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 30వ తేదీన బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆగస్టు 3న ఫలితం వెలువడనుంది. అయితే ఈ స్థానానికి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన జన్ సూరజ్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాను పోటీ చేయకపోయినప్పటికీ తన పార్టీ జన్ సురాజ్ తరఫున పోటీ చేసిన ఒక్క అభ్యర్థినీ గెలిపించలేకపోయారు. 243 స్థానాలకు గానూ 238 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఒక్కసీటులోనూ ఆ పార్టీ గెలవలేకపోయింది. దీంతో అప్పట్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మౌనవ్రతం కూడా చేశారు.
సంబంధిత వార్తలు

Koppula Eshwar | తాడిచర్ల బ్లాక్‌ను సింగరేణియే గుర్తించింది.. కాంగ్రెస్, బీజేపీలు గొప్పలు చెప్తుంటే నవ్వొస్తుంది
జులై 9, 2026

MLA Rakesh Reddy | ఓవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాలు హైడ్రాకు కనిపించడం లేదా..? : ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
జులై 7, 2026

Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
జులై 6, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



