Wedding | పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
Wedding | వివాహ (Wedding) విందులో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారన్న కారణంతో ఇరు వర్గాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటన బీహార్ (Bihar) పట్టణంలో చోటు చేసుకుంది.
Wedding | త్రినేత్ర.న్యూస్ : బీహార్ (Bihar)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహ కార్యక్రమంలో (Wedding) మటన్ (Mutton)కు బదులు చికెన్ (Chicken) వడ్డించారని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన బీహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రి బక్తియార్‌పూర్ పట్టణం (Simri Bakhtiyarpur town)లో చోటుచేసుకుంది.
గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిఖా జరిగింది. నిజానికి వివాహం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. వివాహం అనంతరం విందు సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెళ్లికూతురు తరఫువారు పెళ్లికొడుకు వాళ్లకు వివాహ విందులో మటన్ వడ్డిస్తామని ముందే మాట ఇచ్చారు. తీరా సమయానికి చికెన్ వడ్డించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లికొడుకు తరఫు బంధువులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. కొందరు వ్యక్తులు అతిథులపై కర్రలు, కత్తులతో దాడి చేశారు.
ఈ ఘర్షణలో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడినవారిని సిమ్రి బక్తియాపూర్‌లోని సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Lni One🔷 10-7-26,006
🚨 बिहार: निकाह के भोज में मटन की जगह चिकन परोसने के विवाद में मारपीट,सहरसा के सिमरी बख्तियारपुर में निकाह के बाद आयोजित भोज के दौरान मेन्यू को लेकर विवाद हो गया। दूल्हा पक्ष का आरोप है कि मटन की जगह चिकन परोसे जाने पर कहासुनी शुरू हुई, जो देखते ही देखते… pic.twitter.com/Vv0QcdU04c
— LNI One (@lninewsagency) July 10, 2026
Also Read..
ఢిల్లీ ఎర్రకోటను పేల్చేస్తామంటూ బెదిరింపులు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..
రూ.25వేల ఎస్ఐపీలో అసలు మ్యాజిక్ ఎప్పుడు మొదలవుతుంది? ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ






