త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russian army | రష్యా సైన్యం నుంచి 140 మంది భార‌తీయుల‌కు విముక్తి.. ఆ 55 మంది ఆచూకీ కోసం ప్ర‌య‌త్నాలు

Russian army | రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మోసపూరిత ఏజెంట్ల ద్వారా రష్యన్ సైన్యంలో (Russian army) చేరిన సుమారు 140 మంది భారతీయులు (Indian nationals) ఇప్పటివరకు సురక్షితంగా విడుదలయ్యారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.

D

National | Published On Oct 3, 2026, 4.45 pm IST

Russian army | రష్యా సైన్యం నుంచి 140 మంది భార‌తీయుల‌కు విముక్తి.. ఆ 55 మంది ఆచూకీ కోసం ప్ర‌య‌త్నాలు
Advertisement

Russian army | త్రినేత్ర న్యూస్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మోసపూరిత ఏజెంట్ల ద్వారా రష్యన్ సైన్యంలో (Russian army) చేరిన సుమారు 140 మంది భారతీయులు (Indian nationals) ఇప్పటివరకు సురక్షితంగా విడుదలయ్యారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఇంకా 55 మంది భార‌తీయులు ర‌ష్యా సైన్యంలో ఉన్నార‌ని వారి ఆచూకీ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు పేర్కొంది.

భారత్-రష్యా సంప్రదింపుల కమిటీ స‌మావేశంలో విదేశాంగ శాఖ ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం 55 మంది భార‌తీయులు రష్యన్ సైన్యంలో సేవ‌లందిస్తున్న‌ట్లు పేర్కొంది. వారి వివ‌రాలు, ప్ర‌స్తుత లొకేష‌న్లు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపింది. వారంద‌రినీ త్వ‌ర‌గా డిశ్చార్జ్ చేసే అంశంపై ర‌ష్యా అధికారుల‌తో న్యూఢిల్లీ నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించింది.

"రష్యన్ సైన్యం నుంచి ఇప్పటివరకు దాదాపు 140 మంది భారతీయ పౌరులు విడుదలయ్యారు. మరో 55 మంది ఆచూకీ కోసం భారత ప్రభుత్వం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అదేవిధంగా అమాయక యువకులను మోసగిస్తున్న అక్రమ ఏజెంట్లపై భారత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు" అని విదేశాంగ శాఖ వివ‌రించింది. కాగా, ర‌ష్యా సాయుధ ద‌ళాల్లోకి 227 మంది భార‌తీయులు చేరిన‌ట్లు విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ఇటీవ‌లే వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. వారిలో 51 మంది మ‌ర‌ణించిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌న్నారు.

Also Read..

ఆప్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్

త‌ల‌కు బ్యాండేజ్‌తో శంక‌ర్ - స్టార్ డైరెక్ట‌ర్‌ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళ‌న‌

2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు

Advertisement
Advertisement