Director Shankar | తలకు బ్యాండేజ్‌తో శంకర్ – స్టార్ డైరెక్టర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన
విజయ్ సేతుపతి బత్తా మూవీ ప్రీమియర్‌కు అగ్ర దర్శకుడు శంకర్ తలకు బ్యాండేజ్‌తో అటెండ్ కావడం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శంకర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Entertainment | Published On Oct 3, 2026, 4.42 pm IST
Director Shankar |కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయ్ సేతుపతి కొత్త మూవీ ప్రీమియర్‌కు తలకు బ్యాండేజ్‌తో శంకర్ అటెండ్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఒకప్పుడు ఇండియాలోనే అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగారు శంకర్. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ డిజాస్టర్స్‌తో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు శంకర్... హీరోల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
బత్తా మూవీ...
గేమ్ ఛేంజర్ రిలీజై ఏడాదిన్నర దాటినా ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు శంకర్. విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ మూవీ బత్తా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. బాలాజీ థరనీతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ నిర్మించారు.
తలకు బ్యాండేజ్...
కోలీవుడ్ సెలిబ్రిటీల కోసం ఇటీవలే బత్తా స్పెషల్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ షోకు డైరెక్టర్ శంకర్ కూడా అటెండ్ అయ్యారు. తలకు బ్యాండేజ్‌తో థియేటర్‌లో డైరెక్టర్ శంకర్ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. ఈ ప్రీమియర్‌లో నీరసంగా కూడా కనిపించారు. శంకర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శంకర్ ఏమైంది? తలకు ఎలా దెబ్బతగిలింది అని పోస్ట్‌లు, కామెంట్లు పెడుతున్నారు.
శంకర్ అసిస్టెంట్‌గా...
కాగా ఈ ప్రీమియర్‌లో శంకర్‌తో డైరెక్టర్ ప్రియా అట్లీ ప్రవర్తించిన తీరుపై కూడా నెటిజన్లు ఫైర్ అవుతోన్నారు. శంకర్ శిష్యుడిగానే అట్లీ సినీ ప్రయాణం మొదలైంది. రోబో, నన్బన్‌తో పాటు మరికొన్ని సినిమాలకు శంకర్ వద్ద అట్లీ సహాయకుడిగా పనిచేశారు. శంకర్ స్ఫూర్తితోనే డైరెక్టర్‌గా మారాడు అట్లీ.
అట్లీతో ఫొటోలు...
కాగా బత్తా ప్రీమియర్‌కు వచ్చిన డైరెక్టర్ శంకర్‌ను అట్లీ భార్య ప్రియా అవమానించిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శంకర్ నమస్కారం పెట్టి మాట్లాడటానికి ప్రయత్నించగా...ప్రియా అట్లీ పట్టించుకోలేదు. తన పక్కనున్న వారితో సన్నిహితంగా మాట్లాడింది. మరోవైపు ఈ ప్రీమియర్‌కు వచ్చిన ఫ్యాన్స్ కూడా శంకర్‌ను చూసీచూడనట్లుగానే వ్యవహరించారు. మరోవైపు అట్లీతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతోన్నాయి. సక్సెస్‌లను బట్టే ఇండస్ట్రీలో గౌరవం ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.
https://www.youtube.com/shorts/crinTbk1Xnk
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | సూపర్ స్టార్ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ – ధర్మన్‌లో ధమాకా బ్యూటీ
అక్టోబర్ 3, 2026

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ – తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
అక్టోబర్ 3, 2026

Raashi Khanna | ధర్మన్ కోసం రెమ్యూనరేషన్ డబుల్ చేసిన రాశీఖన్నా
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే
- ●Telangana Congress | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. రెండు సీట్లైనా బీసీలకు ఇవ్వండి
- ●Russian army | రష్యా సైన్యం నుంచి 140 మంది భారతీయులకు విముక్తి.. ఆ 55 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు
- ●Copper Prices | రాగి ధరల దూకుడు.. ఈ మెటల్ స్టాక్స్‌కు భారీ లాభాల ఛాన్స్..
- ●Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
- ●India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు

Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే

Telangana Congress | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. రెండు సీట్లైనా బీసీలకు ఇవ్వండి

Russian army | రష్యా సైన్యం నుంచి 140 మంది భారతీయులకు విముక్తి.. ఆ 55 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు

Copper Prices | రాగి ధరల దూకుడు.. ఈ మెటల్ స్టాక్స్‌కు భారీ లాభాల ఛాన్స్..



