త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Safety Advisory | ఫ్రాన్స్‌లో అల్ల‌ర్లు.. అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ భార‌తీయ పౌరుల‌కు అల‌ర్ట్‌

Safety Advisory | ధ‌ర‌ల పెరుగుద‌ల‌, నానాటికి పెరుగుతున్న జీవ‌న వ్య‌యం, పాఠశాలల్లో అధ్వాన్నమైన పరిస్థితులకు వ్యతిరేకంగా జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌తో ఫ్రాన్స్ (France) అట్టుడుకుతున్న‌ది. పాఠ‌శాల‌ల్లో వ‌స‌తులు మెరుగుప‌ర్చాలంటూ విద్యార్థుల‌తో ప్రారంభ‌మైన నిర‌స‌న‌లు (Protests) తీవ్రరూపం దాల్చ‌డంతో హింసాత్మక అల్లర్లుగా మారాయి.

G

International | Published On Oct 22, 2026, 8.35 am IST

Safety Advisory | ఫ్రాన్స్‌లో అల్ల‌ర్లు.. అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ భార‌తీయ పౌరుల‌కు అల‌ర్ట్‌
Advertisement

Safety Advisory | త్రినేత్ర న్యూస్‌: ధ‌ర‌ల పెరుగుద‌ల‌, నానాటికి పెరుగుతున్న జీవ‌న వ్య‌యం, పాఠశాలల్లో అధ్వాన్నమైన పరిస్థితులకు వ్యతిరేకంగా జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌తో ఫ్రాన్స్ (France) అట్టుడుకుతున్న‌ది. పాఠ‌శాల‌ల్లో వ‌స‌తులు మెరుగుప‌ర్చాలంటూ విద్యార్థుల‌తో ప్రారంభ‌మైన నిర‌స‌న‌లు (Protests) తీవ్రరూపం దాల్చ‌డంతో హింసాత్మక అల్లర్లుగా మారాయి. దేశ‌వ్యాప్తంగా సిటీ హాళ్లు, ఇత‌ర ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, వేలాది వాణిజ్య సంస్థ‌ల‌పై ఉద్య‌మ‌కారులు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. దీంతో ప్ర‌భుత్వం క‌ర్ఫూలు విధించిన‌ప్ప‌టికీ అల్ల‌ర్లు ఏమాత్రం ఆగ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అక్కడ నివసిస్తున్న, పర్యటిస్తున్న భారతీయ పౌరులకు భద్రతా హెచ్చరికలు (Safety Advisory) జారీ చేసింది.

ఈ వారాంతంలో (అక్టోబర్ 24న) మరింత‌ పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగే అవకాశం ఉండటంతో భారతీయులు (Indian Nationals) అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆందోళన ప్రాంతాలకు దూరంగా ఉండాల‌ని, నిరసనలు, పెద్ద ఎత్తున గుంపులు కూడే ప్రాంతాలు, ప్రదర్శనలు జరిగే చోట్లకు వెళ్లకూడ‌ద‌ని సూచించింది. స్థానికంగా అమ‌ల్లో ఉన్న‌ నిబంధనలు పాటించాల‌ని పేర్కొంది. దేశంలోని పలు నగరాల్లో రాత్రి వేళల్లో స్థానిక కర్ఫ్యూలు (Curfew) విధించిన నేప‌థ్యంలో ఫ్రెంచ్ అధికార యంత్రాంగం ఇచ్చే ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. అదేవిధంగా ప్రయాణ అంతరాయాలపై నిరంతరం నిఘా ఉంచాల‌ని సూచించింది. ప్రజా రవాణా వ్యవస్థలో (రైళ్లు, బస్సులు) అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండ‌తో ప్రయాణాలకు ముందు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా సమాచారాన్ని సరిచూసుకోవాల‌ని వెల్ల‌డించింది.


`ఫ్రాన్స్‌లో ప్రస్తుత పరిణామాలు, స్థానికంగా విధించిన కర్ఫ్యూల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి` అంటూ ఇండియ‌న్ ఎంబసీ తన అడ్వైజరీలో పేర్కొంది. నిరసనలు జరుగుతున్న రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని పౌరులను కోరింది.

ఈ వారాంతంలో మళ్లీ నిరసనలు

ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఫ్రాన్స్‌లో నిర‌స‌న‌లు ఆగ‌డం లేదు. ఈ వారాంతంలో మరోసారి భారీ నిరసనలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆందోళనకారులు ప్ర‌క‌టించారు. దీంతో అప్రమత్తన ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. పారిస్‌తోపాటు (Paris) పలు నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. అదేవిధంగా బహిరంగ సభలపై ఆంక్షలు విధించింది. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ లేదా గ్యాస్‌ నింపిన సీసాలు, డబ్బాలు, ప‌టాకులు కలిగి ఉండటాన్ని నిషేధించింది. ఈ వారంతంలో ప్రత్యేక పోలీసుల బలగాలను రంగంలోకి దించనున్నట్టు ప్రకటించింది.

Advertisement
Advertisement