త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saptha Gundala Waterfalls | జాలువారుతున్న‌ స‌ప్త‌గుండాల జ‌ల‌పాతం.. ప్ర‌కృతి ప్రేమికుల గుండెల్లో జ‌ల‌సవ్వ‌డి

గ‌త రెండు రోజుల నుంచి కురుస్తోన్న వ‌ర్షాల కార‌ణంగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని స‌ప్త‌గుండాల జ‌ల‌పాతం( Saptha Gundala Waterfalls )గా పిల‌వ‌బ‌డే మిట్ట జల‌పాతం( Mitta Water Fall ) జాలువారుతోంది.

S

Telangana | Published On Jul 21, 2026, 7.03 am IST

Saptha Gundala Waterfalls | జాలువారుతున్న‌ స‌ప్త‌గుండాల జ‌ల‌పాతం.. ప్ర‌కృతి ప్రేమికుల గుండెల్లో జ‌ల‌సవ్వ‌డి
Advertisement

Saptha Gundala Waterfalls | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్త‌ర తెలంగాణలోని ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ప్ర‌కృతి అందాల‌కు నిల‌యం. ద‌ట్ట‌మైన అడవుల్లో అనేక జ‌ల‌పాతాలు ఉన్నాయి. పాల పొంగులా జ‌ల‌పాతాలు జాలువారుతూ ప్ర‌కృతి ప్రేమికుల గుండెల్లో జ‌ల‌స‌వ్వ‌డి చేస్తుంటాయి. ప్ర‌స్తుతం గ‌త రెండు రోజుల నుంచి కురుస్తోన్న వ‌ర్షాల కార‌ణంగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని స‌ప్త‌గుండాల జ‌ల‌పాతం( Saptha Gundala Waterfalls )గా పిల‌వ‌బ‌డే మిట్ట జల‌పాతం( Mitta Water Fall ) జాలువారుతోంది.

ప‌చ్చ‌ని అడవుల మ‌ధ్య పొంగిపొర్లుతున్న స‌ప్త‌గుండాల జ‌ల‌పాతాల అందాల‌ను తిల‌కించేందుకు స్థానికుల‌తో పాటు ఇత‌ర జిల్లాల నుంచి ప‌ర్యాట‌కులు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంత‌మంతా సంద‌డిగా మారింది. మ‌రి మీరు కూడా ఓసారి స‌ప్త‌గుండాల జ‌ల‌పాతాన్ని సంద‌ర్శించి.. అడ‌వి త‌ల్లిలో ఒదిగిపోండి.

మ‌దిని పుల‌క‌రింప‌జేస్తున్న ఏడు జ‌ల‌పాతాలు..

ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది.

స‌ప్తగుండాల జ‌ల‌పాతానికి ఎలా వెళ్లాలంటే..?

ఈ జ‌ల‌పాతం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండ‌ల ప‌రిధిలో ఉంది. లింగాపూర్‌ మండలంలోని పిట్టగూడ నుంచి 3 కిలోమీటర్లు కాలినడకన వెళితే.. మిట్ట జలపాతానికి చేరుకుంటాం. అక్కడి దట్టమైన హరిత అందాల నడుమ ఒకదానికి ప‌క్కన ఒక్క‌టి 7 జలపాతాలు దర్శనమిస్తాయి. ఈ జ‌ల‌పాతం హైద‌రాబాద్ నుంచి 252 కిలోమీట‌ర్ల దూరంలో, ఉట్నూర్ నుంచి 45 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

Advertisement
Advertisement