Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ – చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన న్యూ ఏజ్ లవ్‌స్టోరీ దీవాన ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. జూలై 31 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. స్నేహ మణిమేఘలై హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Jul 26, 2026, 12.28 pm IST
Telugu OTT | మెయిల్, శుభం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యంగ్ హీరో హర్షిత్ రెడ్డి. ప్రభాస్ కల్కి 2898 ఏడీలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన దీవాన మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. న్యూ ఏజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహ మణిమేఘలై హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు.
ఆహా ఓటీటీలో...
ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీవానా ఓటీటీ రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. జూలై 31 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. గోల్డ్ సబ్‌స్కైబర్లు ఒక రోజు ముందుగానే ఈ సినిమాను చూడొచ్చని ఆహా ప్లాట్‌ఫామ్ ప్రకటించింది.
సెన్సార్‌పై విమర్శలు...
దీవాన మూవీలో హర్షిత్ రెడ్డి యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో పాటు ట్విస్ట్‌లు, పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కట్ చేయడమే కాకుండా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డ్ తీరును ఉద్దేశించి దర్శకనిర్మాతలు చేసిన ఆరోపణలు అప్పట్లో వివాదానికి దారితీశాయి.
మున్నా ప్రేమకథ....
మున్నా డిగ్రీ పూర్తిచేస్తాడు. ఉద్యోగం చేయకుండా స్నేహితులతో జల్సాలు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. అమూల్యను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ప్రభుత్వం ఉద్యోగం వస్తేనే మున్నా ప్రేమను అంగీకరిస్తానని అమూల్య కండీషన్ పెడుతుంది. మున్నాతో అమూల్య ఎందుకలా చెప్పింది? ఆమె చెప్పినట్లే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడా? అమూల్య గురించి మున్నాకు తెలిసిన షాకింగ్ నిజం ఏమిటన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Comedy OTT | ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైన తెలుగు కామెడీ మూవీ – పవన్ కళ్యాణ్ హీరో
జులై 24, 2026

OTT | ఓటీటీలోకి తెలుగు హీరోయిన్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లోయింగ్
జులై 20, 2026

Telugu OTT | ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైన తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ
జులై 17, 2026
తాజావార్తలు
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్‌గా అరుదైన ఘనత
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్‌గా అరుదైన ఘనత



