JEE Main 2026 Session 2 | దరఖాస్తు చేశారా?.. నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్లు
JEE Main 2026 Session 2 | దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే అర్హత పరీక్ష జేఈఈ మెయిన్ సెషన్ 2 (JEE Main 2026 Session 2) దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. బుధవారం (ఫిబ్రవరి 25) రాత్రి 11.50 గంటలకు గడువు ముగియనుంది.
JEE Main 2026 Session 2 | త్రినేత్ర.న్యూస్: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే అర్హత పరీక్ష జేఈఈ మెయిన్ సెషన్ 2 (JEE Main 2026 Session 2) దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. బుధవారం (ఫిబ్రవరి 25) రాత్రి 11.50 గంటలకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in. ద్వారా రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2న సెషన్ 2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. తొలి విడత పరీక్షలు రాసిన అభ్యర్ధులు కూడా జేఈఈ మెయిన్ సెషన్ 2కు దరఖాస్తు చేసుకోవచ్చు.
గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన అభ్యర్ధులు మళ్లీ అప్లయ్‌చేయాల్సిన పనిలేదు. రెండు విడతల్లో పరీక్షలు రాసిన వారికి రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను అంతిమంగా పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ర్యాంకు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో ర్యాంకు సాధించిన తొలి 2.5 లక్షల మందిని మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి.
కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష మే 17న నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 2 పేపర్లు ఉంటుంది. పేపర్ 1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగనుంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ జూన్ 2న ప్రారంభంకానుంది.
తాజావార్తలు
- ●TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం

Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు






